Karnataka Govt Excise Duty : మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన ప్రభుత్వం

కర్ణాటకలో బీజేపీని ఓడించి ఘన విజయం సాధించి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

Karnataka Govt Excise Duty : మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన ప్రభుత్వం

Karnataka Govt Excise Duty

Karnataka Siddaramiah Govt  : కర్ణాటకలో బీజేపీని ఓడించి ఘన విజయం సాధించి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah)ప్రభుత్వం శుక్రవారం (జులై 7,2023) 2023-24 సంవత్సరానికి గాను బడ్డెట్ ను ప్రవేశపెట్టింది.ఈ సందర్భంగా బీర్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని మొత్తం 18 స్లాబ్ లపై 20 శాతం పెంచగా..బీర్ పై ఎక్సైజ్ సుంకాన్ని 175 శాతం నుంచి 185కు పెంచింది. ఎక్సైజ్ రేట్లు పెరిగిన తరువాత కూడా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో మద్యం ధరలు తక్కువగానే ఉంటాయని సీఎం సిద్దరామయ్య తెలిపారు.

మొత్తం 18 శ్లాబ్‌లలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రేట్లను 20శాతం పెంచాలని సూచించారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 ఎన్నికల వాగ్దానాలు చేసిన సీఎం సిద్ధరామయ్య.. ఈ ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన వాగ్ధానాల కోసం సుమారు రూ.52 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు.దీని వల్ల రూ.1.3 కోట్ల మంది లబ్ది పొందుతారని వెల్లడించారు.

Modi in Warangal: ప్రధాని మోదీ ‘వరంగల్ పర్యటన’ బీజేపీకి ఎందుకింత ప్రతిష్టాత్మకం? దక్షిణ భారతంతో దీనికి సంబంధం ఏంటి?

అలాగే తాము ఇచ్చిన వాగ్ధానాల్లో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు,200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తు, పేద‌ల‌కు 10 కిలోల ఉచిత బియ్యం, మ‌హిళ‌ల‌కు రూ.2వేలు, నిరుద్యోగ భృతి 3వేలు వంటి హామీలు నెరవేర్చాలంటే కర్ణాటక ప్రభుత్వం ఖజానా నిడాలి. దీంట్లో భాగంగా మొదటగా మద్యంపాలసీపై(Liquor Policy) సీఎం సిద్దరామయ్య ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన తర్వాత పొరుగు రాష్ట్రాలతో పోల్చినా.. పొరుగు రాష్ట్రాల కంటే కర్ణాటకలో మద్యం ధర తక్కువగానే ఉంది. అదే విషయాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రత్యేకించి గుర్తు చేశారు.