Anti Rape Footwear : ‘అత్యాచారం నిరోధక పాదరక్షలు’ తయారు చేసిన విద్యార్థిని ..
10th class చదువుతున్న విజయలక్ష్మి బిరాదార్ అనే విద్యార్ధిన లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పోకిరిగాళ్లనుంచి రక్షణ కోసం ‘యాంటీ రేప్ ఫుట్ వేర్’ తయారు చేసింది.

Girl student develops Anti rape footwear with gps in kalaburagi
Anti Rape Footwear : కర్ణాటకకు చెందిన విజయలక్ష్మి బిరాదార్ అనే విద్యార్థిని అత్యాచార నిరోధక పాదరక్షలను(యాంటీ రేప్ ఫుట్ వేర్) రూపొందించింది. కర్ణాటక కల్బుర్గిలోని ఎస్‌ఆర్‌ఎన్ మెహతా స్కూల్లో 10th class చదువుతున్న విజయలక్ష్మి బిరాదార్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పోకిరిగాళ్లనుంచి తమను తాము రక్షించుకోవడానికి యాంటీ రేప్ ఫుట్ వేర్ తయారు చేసి ప్రశంసలు అందుకుంటోంది. దేశంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయని..చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాల బారిన పడుతున్నారని ఇది తనను చాలా ఆవేదనకు గురిచేసిందని దీని కోసం మనం ఏమన్నా చేయాలేమా? అనే ఆలోచనలు తనను నిరంతరం వెంటాడేవని ఈక్రమంలో తనకు వచ్చిన ఓ ఆలోచతో ఇటువంటి పాదరక్షలు తయారు చేశానని తెలిపింది. అత్యాచారాలకు గురి కాకుండా మహిళలకు ఈ పాదరక్షలు ఎంతో సహాయపడుతాయని విజయలక్ష్మి తెలిపింది.
తమపై దాడి జరిగితే..సదరు బాధితురాలు ఈ అత్యాచార నిరోధక పాదరక్షలు వాడితే అత్యాచారానికి పాల్పడేవారికి ఈ యాంటీ రేప్ ఫుట్ వేర్ వల్ల తీవ్ర హాని కలుగుతుందని విజయలక్ష్మి వివరించింది. మహిళలకు భద్రత కల్పించే ఈ పాదరక్షల్లో అమర్చిన ఒక పరికరం లైంగికంగా వేధించేవారిని విద్యుదాఘాతానికి గురి చేస్తుందని వెల్లడించింది విజయలక్ష్మి.
ఈ పాదరక్షలు, బ్యాటరీతో నడిచే విధంగా తయారు చేశానని..అత్యాచారానికి పాల్పడాలనుకునే వ్యక్తిని దాడి చేసే సమయంలో తన్నితే ఆ వ్యక్తిని విద్యుదాఘాతానికి గురిచేసి గాయపరుస్తుందని తెలిపింది. దీంతో సదరు బాధితురాలు సురక్షితంగా తప్పించుకోవచ్చని విజయలక్ష్మి వివరించింది.
ఈ పాదరక్షల్లో ఒక జిపిఎస్ (GPS) ట్యాగ్ కూడా ఉంటుందని..దీని ద్వారా అమ్మాయికి సంబంధించిన ఎమర్జన్సీ నంబర్‌కు హెచ్చరిక పంపుతుందని..ఆమె ప్రమాదంలో ఉందనే సమాచారాన్ని అవతలివారికి సమాచారం అందుతుందని దీంతో ఆమెకు వెంటనే సహాయం అందే అవకాశం ఉంటుందని వివరించింది. సమాచారం అందించి వారికి బాధితురాలు ఎక్కడ ఉందనే లొకేషన్ వివరాలు కూడా పంపుతుందట. అత్యాచారాలు జరిగాయనే వార్తలు విన్నప్పుడు..చదివినప్పుడు తాను ఎంతో ఆవేదన చెందేదాన్ని అని దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అమ్మాయిలు..మహిళలు..చిన్నారులు జీవితాలు కష్టాలపాలు కాకుండా కాపాడేది ఏమన్నా ఉండే బాగుండు అని తాను అనుకునేదాన్ననని తెలిపింది. అలా తాను 7th classలో ఉన్పప్పుడే ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించానని అలా ఎన్నో ఆలోచనలు రాగా ఈ ప్రాజెక్టును ప్రారంభించానని విజయలక్ష్మి తెలిపింది.
విజయలక్ష్మి రూపొందించిన ఈ ‘యాంటీ రేప్ ఫుట్ వేర్'(Anti rape footwear) ‘ఇంటర్నేషనల్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్ అవార్డు'(International Invention and Innovation Award)తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ ఆవిష్కరణతో మహిళల భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఇంత చిన్నవయస్సులోనే ఇంతటి ఘనత సాధించిన విజయలక్ష్మీ బిరాదార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.