Tipu Sultan : కర్ణాటకలో టిప్పు సుల్తాన్ పాఠం వివాదం

వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది కర్ణాటక బీజేపీ సర్కార్‌. మొన్నటి వరకు జరిగిన హిజబ్ వివాదం మరువక ముందే.. మరో వివాదం కర్ణాటక సర్కార్‌ను చుట్టుముడుతోంది.

Tipu Sultan : కర్ణాటకలో టిప్పు సుల్తాన్ పాఠం వివాదం

Tipu Sultan Issue In Text Book Lessons

Updated On : March 29, 2022 / 9:23 AM IST

Tipu Sultan :  వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది కర్ణాటక బీజేపీ సర్కార్‌. మొన్నటి వరకు జరిగిన హిజబ్ వివాదం మరువక ముందే.. మరో వివాదం కర్ణాటక సర్కార్‌ను చుట్టుముడుతోంది. టిప్పు సుల్తాన్ చరిత్ర గురించి పెద్దగా విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం లేదంటూ కొన్ని అంశాలను తొలగించడానికి సిద్ధమయ్యింది. దీనిపైనే మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

టిప్పు సుల్తాన్.. పేరు వింటే చాలు.. బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన యోధుడని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు టిప్పు సుల్తాన్ పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే హిజబ్ వివాదంతో రగిలిపోతున్న కర్ణాటకలోనే టిప్పు సుల్తాన్ పేరు మారుమోగిపోతోంది. పాఠ్యాంశంగా ఉన్న టిప్పు సుల్తాన్ జీవిత చరిత్రలో నుంచి.. కొన్ని అంశాలను తొలగించేందుకు కర్ణాటక సర్కార్ నిర్ణయించిందనే ప్రచారంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం రోహిత్ చక్రతీర్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ఉన్న సిలబస్‌పై రివ్యూ చేసిన ఆ కమిటీ.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. పాఠ్యాంశాల్లో టిప్పు హిస్టరీ ఉంచినా.. అందులోనుంచి కీర్తి ప్రతిష్టల విషయాలు అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. ఆరు నుంచి పదో తరగతి వరకు సోషల్‌ స్టడీస్‍‌లో టిప్పు చరిత్ర పాఠ్యాంశంగా ఉండగా.. టైగర్ ఆఫ్ మైసూర్‌గా టిప్పు సుల్తాన్‌ను ప్రస్తావించారు. టైగర్ ఆఫ్ మైసూర్ అనేందుకు కావాల్సిన ఆధారాలు లేవని రోహిత్ తన రిపోర్ట్‌లో పేర్కొనడంతో పాటు కొన్ని అంశాలను తొలగించాలని రిపోర్ట్ ఇచ్చారు.
Also Read : Telugu Desam Party : టీడీపీ 40 ఏళ్ల వ్యవస్ధాపక దినోత్సవం
టిప్పు సుల్తాన్ జీవిత చరిత్రలో కొన్ని సున్నిత అంశాలను తొలగించాలని సూచించిన రోహిత్ కమిటీ.. రాణీ గైడిన్‌లు, మైసూర్ వడయార్ల చరిత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని జోడించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే.. కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం, బీజేపీ శ్రేణులు సమర్థిస్తుంటే..  విపక్షాలు విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి.