Zameer Ahmed Khan: కర్నాటక హౌసింగ్, మైనారిటీ శాఖల మంత్రి జమీర్ అహద్మ్ ఖాన్ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగాడు. పాకిస్తాన్ పై సూసైడ్ బాంబు దాడికి తాను సిద్ధం అని చెప్పారు. పాకిస్తాన్ పై యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ యుద్ధంలో సూసైడ్ బాంబర్ అవ్వడానికి నేను రెడీ అని ఆయన అన్నారు.
మనం మనమే. మొదటి నుంచి నేను ఇదే చెబుతున్నా. మనం భారతీయులం. హిందూస్తానీయులం. మాకు పాకిస్తాన్ తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పాక్ లోకి వెళ్లి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నేను జోక్ గా చెప్పడం లేదు. దేవుడి మీద ఒట్టు” అని మంత్రి అహ్మద్ ఖాన్ అన్నారు.
బళ్లారి కాంగ్రెస్ ఎంపీ తుకారాంతో కలిసి మీడియాతో మాట్లాడారు ఖాన్. పహల్గాం ఉగ్రదాడికి మద్దతిచ్చినట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్‌తో భారతీయ ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
Also Read: శ్రీలంకలో పహల్గాం దాడి ఉగ్రవాదులు..! సమాచారం ఇచ్చిన భారత్..
”యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం నన్ను మంత్రిగా పంపగలదు. నేను వెళ్లి ఆత్మాహుతి బాంబు పెడతాను. నేను జోక్ చేయడం లేదు. నా అవసరం ఉంటే.. మోదీ, అమిత్ షా నాకు ఆత్మాహుతి బాంబును అందిస్తే, నేను అల్లా, దేవుడి మీద ప్రమాణం చేస్తాను, నేను బాంబును కట్టుకుని పాకిస్తాన్‌పై యుద్ధం చేయడానికి వెళ్తాను” అని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి అహ్మద్ ఖాన్.