Pahalgam Terrorists In Sri Lanka: శ్రీలంకలో పహల్గాం దాడి ఉగ్రవాదులు..! సమాచారం ఇచ్చిన భారత్‌..

పహల్గాం దాడితో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

Pahalgam Terrorists In Sri Lanka: శ్రీలంకలో పహల్గాం దాడి ఉగ్రవాదులు..! సమాచారం ఇచ్చిన భారత్‌..

Updated On : May 3, 2025 / 5:43 PM IST

Pahalgam Terrorists In Sri Lanka: పహల్గాం అటాక్ ఉగ్రవాదులు శ్రీలంకలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగురు అనుమానితులను కొలంబోలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చెన్నై నుంచి బండారనాయక ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో వెంటనే శ్రీలంక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కొలంబో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు ఉగ్రవాదులు ఇండియాలోనే ఉన్నారని ఎన్ఐఏ భావించింది. జమ్ములోనే తలదాచుకున్నారని అనుమానం వ్యక్తం చేసింది. పహల్గాం దాడిపై విచారణ చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దక్షిణ జమ్ములోనే ముష్కరులు ఉన్నారని చెప్పింది. పక్కా ప్లాన్ తో పహల్గాం దాడి చేసిన టెర్రరిస్టులు.. దాడికి ముందే ప్రణాళికతో జమ్ములోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వెంటనే బోర్డర్లను మూసి వేస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు.

Also Read: పాకిస్థాన్‌కు మ‌రో బిగ్ షాకిచ్చిన భారత్.. ఆ దేశం నుంచి దిగుమతులన్నింటిపైనా నిషేధం.. భారత్‌లో వీటి ధరలు పైపైకి..

జమ్ములోకి అడుగు పెట్టినప్పుడే ఎప్పుడు, ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనే స్థావరాన్ని కూడా రెడీ చేసుకున్నారని, వారిని కవర్ ఫైర్ చేసేలా బ్యాకప్ టీమ్స్ రూపొందించుకున్నారని తెలుస్తోంది. అలాగే వారి వెంట భారీ ఆహార పదార్ధాలు, అత్యవసర వస్తువులు సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళ్లినట్లుగా ఎన్ఐఏ అంచనా వేసింది. అయితే, ఇప్పుడు అక్కడి నుంచి చెన్నై వెళ్లిన ఉగ్రవాదులు విమానంలో కొలంబోకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

 

మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాంలో ఉగ్రవాదులు కొన్ని రోజులకు ముందే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు దర్యాఫ్తులో తేలింది. ఘటన అనంతరం దర్యాఫ్తు బృందాలు టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశారు. ఓ గ్రౌండ్ వర్కర్ ద్వారా ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏకి కీలక ఆధారాలు లభించినట్లుగా సమాచారం. ఉగ్రవాదులు ఏప్రిల్ 15వ తేదీనే పహల్గాంకు చేరుకున్నట్లు దర్యాఫ్తులో తేలింది. ఆ తర్వాత ఉగ్రవాదులు నాలుగు చోట్ల రెక్కీలు నిర్వహించినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో 20మంది వరకు సహకరించినట్లు దర్యాఫ్తు సంస్థ గుర్తించింది.

Also Read: సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్‌.. పీవోకేలో ప్రజలకు కీలక ఆదేశాలు

ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతిపరులే అత్యంత కీలక పాత్ర పోషించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. సానుభూతిపరులే ఉగ్రవాదులకు అవసరమైన సమాచారం, ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో రెండు శాటిలైట్ ఫోన్లు వాడిన సంకేతాలను దర్యాఫ్తు బృందాలు గుర్తించాయి.