‘నాన్నా.. భార్య వేధింపుల వల్ల చనిపోయాడని నా శవపేటికపై రాయించండి..‘ ఓ వ్యక్తి చివరి లేఖ.. చదువుతుంటే..
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి (38) భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పింకీ అనే మహిళతో..

Karnataka man dies by suicide
గతేడాది బెంగళూరు సాప్ట్ వేర్ ఉద్యోగి అతుల్ సుభాశ్ బలవన్మరణం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భార్య వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతుల్ దాదాపు 40 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు అతను వీడియోనుసైతం విడుదల చేశాడు. తన చావుకు నా భార్య వేధింపులే కారణం అని పేర్కొన్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేతరహాలో భార్య, మామ వేధిస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాసి బెంగళూరుకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తిప్పణ్ణ రైలు కింద పడి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా.. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఓ వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Meerpet Madhavi Case : గురుమూర్తి ఒళ్లు గగుర్పొడిచే పని.. భార్య మాధవి మృతదేహం కాలుతున్న సమయంలో
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి (38) భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పింకీ అనే మహిళతో అతనికి వివాహం జరిగింది. కొద్దికాలంకే వారి వైవాహిక జీవితంలో గొడవలు మొదలయ్యాయి. గత మూడు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రం కావటంతో ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. తనకు విడాకులు కావాలని, భరణం కింద రూ.20లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేస్తుంది. అయితే, కోర్టులో విడాకుల కేసు కొనసాగుతుంది. ఈ ఇబ్బందులు తాళలేక పీటర్ తాను చనిపోతున్నట్లు తన తండ్రికి లేఖరాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీటర్ తన తండ్రికి రాసిన లేఖలో.. ‘‘నాన్న.. నన్ను క్షమించు. నా భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తుంది. ఆమె నా చావును కోరుకుంటుంది. నా భార్య వేధింపుల కారణంగా నేను చనిపోతున్నాను. ఆమె వేధింపుల వల్లే చనిపోయానని నా శవ పేటికపై రాయించండి’’ అంటూ పీటర్ లేఖలో పేర్కొన్నాడు.
Also Read: మలయాళ సినిమా సూక్ష్మదర్శిని చూసి ఆ ప్లాన్ తో హత్య
పీటర్ సోదరుడు జోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులం చర్చికి వెళ్లాం. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకోగా పీటర్ చనిపోయి ఉన్నాడు. అతని పక్కనే సూసైడ్ నోట్ ఉంది. అందులో నా భార్య నేను చనిపోవాలని కోరుకుంటుందని రాశాడు. నాన్న నన్ను క్షమించండి.. అన్నా దయచేసి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ లేఖలో రాశాడని జోయల్ తెలిపాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవులు జరుగుతున్నాయని, మూడు నెలలుగా వారిద్దరూ వేరుగా ఉంటున్నాడని జోయల్ పేర్కొన్నాడు. వారిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. విడాకుల కేసులో రూ.20లక్షల భరణం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఆ కారణంగానే పీటర్ తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడినట్లు జోయల్ చెప్పాడు.
పీటర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. పీటర్ రాసిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.