12 Year Boy Dies in Heart Stroke : హార్ట్‌ఎటాక్‌తో 12 ఏళ్ల బాలుడి మృతి

హార్ట్‌ఎటాక్‌తో 12 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. ఆటలాడుకుని వచ్చి హాయిగా నిద్రపోవాల్సిన 12 ఏళ్ల వయస్సు బాలుడు ‘గుండె’పట్టుకుని కుప్పకూలిపోయాడు.కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.

12 Year Boy Dies in Heart Stroke : హార్ట్‌ఎటాక్‌తో 12 ఏళ్ల బాలుడి మృతి

Karnataka12 year old boy dies in Madikeri District Due To Heart Stroke

Updated On : January 9, 2023 / 12:37 PM IST

12 Year Boy Dies in Heart Stroke : ఆటలాడుకుని వచ్చి హాయిగా నిద్రపోవాల్సిన 12 ఏళ్ల వయస్సు బాలుడు ‘గుండె’పట్టుకుని కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు హుషారుగా ఆటపాటల్లో తేలిపోయిన పిల్లాడు హఠాత్తుగా కుప్పకూలిపోయే సరికి తల్లిదండ్రులు హడలిపోయారు. ఆ బాలుడు కారణం హార్ట్ ఎటాక్. అదేంటీ 12 ఏళ్ల పసిపిల్లాడికి హార్ట్ ఎటాకా? అని ఆశ్చర్యపోతాం. నిజమే కర్ణాటకలోని మడికేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. కుశాల నగర్ లోని కూడుమంగళూరులో స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నన్న మంజాచారి అనే వ్యక్తికి 12 ఏళ్ల కీర్తన్ అనే కొడుకు ఉన్నాడు. కీర్తన్ 6th క్లాస్ చువుతున్నాడు. శనివారం (జనవరి 7,2023) సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. వచ్చిన కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ విలవిల్లాడిపోయాడు. కాసేపటికే కుప్పకూలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు కీర్తన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పరీశీలించిన డాక్టర్లు అప్పటికే కీర్తన్ చనిపోయాడని చెప్పారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కీర్తన్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడ్చారు. అప్పటి వరకు ఆడుకున్న పిల్లాడు 12 ఏళ్లకే గుండెపోటుతో చనిపోవటమేంటీ? ఇంత చిన్నవయస్సు వారికి కూడా గుండెపోటు వస్తుందా? అని కన్నీరు మున్నీరుగా విలపించారు.