గోవధ నిషేధ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 11:13 PM IST
గోవధ నిషేధ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

Updated On : December 10, 2020 / 7:16 AM IST

KarnatakaPasses Anti-Slaughter Bill In Assembly కర్ణాటకలో గోవధను నిషేధించేందుకు ప్రవేశపెట్టిన ‘ప్రివెన్షన్​ ఆఫ్​ స్లాటర్​ అండ్​ ప్రిజర్వేషన్​​ ఆఫ్​ కాటిల్​ బిల్​-2020’ను బుధవారం(డిసెంబర్-9,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా గోవులను చంపినా, హింసకు పాల్పడినా ఈ చట్టం ద్వారా వారికి కఠిన శిక్షలు విధించనున్నారు.



అయితే, ఇవాళ ఈ బిల్లును ళ కర్ణాటక అసెంబ్లీలో పశుసంరక్షణ మంత్రి ప్రభు చవాన్​ ప్రవేశపెట్టిన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది. విపక్షలు స్పీకర్​ వెల్​లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టాయి. వ్యాపార సలహాదారు కమిటీ సమావేశంలో ఈ బిల్లు గురించి తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి కొత్త బిల్లులను ప్రవేశపెట్టకూడదని నిర్ణయించినట్టు.. కేవలం ఆర్డినెన్స్​ల ఆమోదానికే అంగీకరించినట్టు.. కానీ ప్రభు చవాన్​.. అనూహ్యంగా సభలో బిల్లు ప్రవేశపెట్టారని విపక్షాలు మండిపడ్డాయి. ఈ గందరగోళం మధ్యే బిల్లుకు ఆమోదం లభించింది.



బీఫ్ ని పశువుల మాంసం (13 ఏళ్ల లోపు ఆవు, దూడ, ఎద్దు, ఎద్దు మరియు మగ లేదా ఆడ గేదె)గా ఈ చట్టం నిర్వచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు (లేదా)10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.