Ishit Bhatt
KBC 17 kid Controversy: సోషల్ మీడియాలో ఓ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఓ పదేళ్ల కుర్రాడు కేబీసీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎదుట కూర్చుని ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు పూర్తి చేయకముందే ఆన్సర్లు చెప్పేస్తూ ఉన్నాడు. టకా టకా ఆన్సర్ చెప్పడమే కాకుండా.. అంత పెద్ద స్టార్ అమితాబ్ బచ్చన్ ని కూడా కనీసం గౌరవించకుండా చాలా కేర్ లెస్ గా, పొగరుగా మాట్లాడుతున్నట్టు ఆ వీడియోని చూసిన వెంటనే చాలా మంది అనుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ‘వీడెంత.. వీడి వయసెంత? అమితాబ్ బచ్చన్ ముందు ఆ వేషాలేంటి? కనీసం పెద్దలను గౌరవించాలన్న కనీసం ఇంగితం లేదా? వాడి పొగరు చూడు. బాగా బలుపు.’ ఇలా చాలా మంది చాలా చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ‘అసలు ఆ కుర్రాడిని కాదు. వాడి అమ్మానాన్నలని అనాలి. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు కనీసం ఎలా మాట్లాడాలో నేర్పనందుకు.’ అని విమర్శించిన వాళ్లూ ఉన్నారు.
సిక్స్ పాకెట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే?
మీరు కూడా అలాగే అనుకుంటే మీరు ఓ విషయం తెలుసుకోవాలి. అదే ‘సిక్స్ పాకెట్ సిండ్రోమ్’. అంటే ప్రస్తుతం న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏర్పడిన సమస్య ఇది. అంటే ఒక్కడే పిల్లోడు. వాడి అమ్మానాన్న. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య. ఇలా ఆరుగురు అన్నమాట. దీన్నే సిక్స్ పాకెట్ అంటారు. అంటే ఒక్కడే పిల్లాడు అని అతి గారాబం చేస్తారు. వాళ్లు ఏం అడిగితే అది తెస్తారు. ఒక్కోసారి అడక్కముందే ఇస్తారు. కొండమీది కోతిని కూడా తెచ్చి ఇచ్చేస్తారు. దీన్ని సిక్స్ పాకెట్ సిండ్రోమ్ అంటారు.
ఇది మొదట చైనాలో మొదలైంది. అక్కడ ఒక్కరు ముద్దు అనే నినాదం చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. జనాభా కంట్రోల్ చేయడానికి వాళ్లు దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ సమస్య మొదలైంది. ఇలాంటి పిల్లలు అడిగింది దొరక్కపోతే గోల గోల చేస్తారు. అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. చేతికి ఏం వస్తే అది విసిరేస్తారు. విలువ, గౌరవం లాంటివి ఏవీ తెలియదు. ఒకవేళ వాళ్లకు చెప్పే ప్రయత్నం చేసినా వాళ్లు తలకెక్కించుకోలేరు.
ఇలాంటి వాళ్లు బాహ్యసమాజంలో ఉండే సమస్యలు, పద్ధతులు లాంటివి అర్థం కావు. పట్టించుకోరు. ఎప్పుడూ అవార్డులు, రివార్డులు, గుర్తింపు, అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్లు కోరుకున్నది జరగకపోతే మాత్రం నానాయాగీ చేస్తారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలు అలాంటి పరిస్థితికి చేరకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్లకు బౌండరీలు గీయాలి. టీవీ, స్క్నీన్ టైమ్ లాంటివి ఫిక్స్ చేయాలి. అంతకు మించి చూడడానికి వీల్లేదని చెప్పాలి. పాకెట్ మనీ లాంటివి నేర్పాలి. అవి ఖర్చు చేసేస్తే మళ్లీ వచ్చే నెల వరకు డబ్బులు ఇవ్వబోమని చెప్పాలి. అడిగిన ప్రతి వస్తువూ కొనకూడదు. గోల చేసి రచ్చ చేసినా కూడా కొనొద్దు. వయసుకి తగిన పనులు అప్పగించాలి. వాళ్ల పనులు వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించాలి. స్వతంత్రత అలవాటు చేయాలి. పిల్లలతో గ్రూప్ యాక్టివిటీస్ లో పాల్గొనేలా చేయాలి. అవతలి వాళ్ల అవసరాలు వీళ్లకు తెలియాలి. సాయం చేయడం తెలియాలి. సాయం అడగడం తెలియాలి. అలాంటప్పుడే వాళ్లకు బాహ్యప్రపంచం అర్థం అవుతుంది.
Irritating kid on KBC with satisfying End pic.twitter.com/SjjxEpxtJK
— The codewali (@the_codewala) October 13, 2025
ఆసీస్‌తో తొలి వన్డే.. సచిన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్.. కోహ్లీ సాధించేనా..?