Kerala: మరింత వేడెక్కిన కేరళ.. గవర్నర్ తొలగింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్‭లర్‭ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా మరొక వ్యక్తి నూతన ఛాన్స్‭లర్‭ నియామకం చేపట్టాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.

Kerala: మరింత వేడెక్కిన కేరళ.. గవర్నర్ తొలగింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Kerala Assembly passes bill to remove Governor as chancellor of universities

Updated On : December 13, 2022 / 6:52 PM IST

Kerala: కేరళ గవర్నర్‭కు పినరయి ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదం మరింత హీటెక్కింది. విశ్వవిద్యాలయాల కులపతి (ఛాన్స్‭లర్) పదవి నుంచి గవర్నర్‭ను తొలగించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు కదిలింది. ఈ విషయమై ఏకంగా బిల్లు రూపొందించిన ప్రభుత్వం, నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకుంది. ‘యూనివర్సిటీ చట్టాలు (సవరణ) బిల్లు 2022’ అనే బిల్లు మంగళవారం కేరళ అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం కేరళ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో గవర్నర్‭ను ఛాన్స్‭లర్‭గా కొనసాగించకూడదు. ఆ పదవుల్లో రాష్ట్ర ప్రభుత్వమే వేరే ఎవరినైనా నియమిస్తుంది.

అయితే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్‭లర్‭ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా మరొక వ్యక్తి నూతన ఛాన్స్‭లర్‭ నియామకం చేపట్టాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.

Bela Trivedi: బిల్కిస్ బానో వేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది