Solar Umbrella For Traffic Personnel : మండే ఎండల్లో చల్ల చల్లగా..ట్రాఫిక్ పోలీసుల కోసం సోలార్ గొడుగులు
ట్రాఫిక్ పోలీసుల కష్టాలను తీర్చే ప్రయత్నాల్లో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండుతున్న ఎండల్లో గంటల తరబడి నిల్చొని విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల కోసం

Kerala2
Solar Umbrella For Traffic Personnel : మండుతున్న ఎండల్లో గంటల తరబడి నిల్చొని విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేక సదుపాయాలతో కూడిన సౌరగొడుగులను అందించేందుకు కేరళ ప్రభుత్వం రెడీ అయింది. పైలట్ ప్రాజెక్టుగా కొచ్చి సిటీలో ఇలాంటి ఐదు గొడుగులను కేరళ పోలీసు విభాగం ఏర్పాటు చేసింది.
ఈ గొడుగు లోపల సౌరశక్తి ఆధారంగా పనిచేసే ఒక ఫ్యాన్ ఉంటుంది. వాటర్ బాటిల్ పెట్టుకొనేందుకు వీలుగా ఒక స్టాండ్ కూడా అమర్చారు. గొడుగు పైభాగాన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. గొడుగు కింది భాగంలో బ్యాటరీ ఉంటుంది. గొడుగు కింద కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైట్ ఏర్పాటు చేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఎప్పుడూ నిల్చొనే పనిచేసే ట్రాఫిక్ పోలీసులు కొంతసేపు కూర్చునే వీలుంటుంది.ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే..ఇతర జిల్లాలకు కూడా విస్తరించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ Bangarraju: వాసివాడి తస్సదియ్యా టీజర్.. చిట్టితో అక్కినేని హీరోల అల్లరి డాన్స్!