కేరళలో ఏనుగు ప్రమాదవశాత్తు చనిపోయింది: పర్యావరణ మంత్రిత్వ శాఖ

కేరళలో గర్భిణీ ఏనుగు మృతిపై ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తు మందుగుండు నిండిన పండ్లను తినడం వల్లే ఏనుగు చనిపోయినట్లు తేలిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అడవి పందులను తోటలు, పొలాలలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టడానికి స్థానికులు తరచూ పేలుడు పదార్థాలతో నిండిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని చెప్పారు.
ఏదిఏమైనా ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పర్యావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సైలెంట్ వ్యాలీ అడవిలో ఆ ఏనుగు వయసు 15 ఏళ్లని, గర్భంతో ఉన్నదని, పండును తినడానికి ప్రయత్నించినప్పుడు అది నోటిలో పేలిపోయి ఉంటుందనే నిర్ధారణకు వచ్చామని పర్యావరణ శాఖతన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ వరుస ట్వీట్లలో తెలిపింది. కేరళ ప్రభుత్వంతో మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సోషల్ మీడియా “పుకార్లను” నమ్మవద్దని ప్రజలను అభ్యర్థించారు. ఈ విషయంలో ఎవరిదీ ఉద్దేశపూర్వక తప్పు లేదని, అయినప్పటికీ, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు.
Read: CORONAను లైట్ తీసుకుంటున్నారా.. సెర్చింగ్ మానేసిన నెటిజన్లు