అర్థరాత్రి మహిళలు ‘నైట్ వాక్’  : అఘాయిత్యాలకు భయపడం..

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 03:45 AM IST
అర్థరాత్రి మహిళలు ‘నైట్ వాక్’  : అఘాయిత్యాలకు భయపడం..

Updated On : December 30, 2019 / 3:45 AM IST

మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా  అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు భయపడి మేం ఇంటికే పరిమితం కాము అని చాటి చెప్పేందుకు ఆదివారం (డిసెంబర్ 29) అర్థరాత్రి  నడిచి చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ మహిళల నైట్ వాక్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. రాత్రి 11 నుంచి 1 గంట వరకూ మహిళలు నైట్ వాక్ చేశారు. కేరళలోని 100 ప్రాంతాలలో ఈ నైట్ వాక్ కార్యక్రమం జరిగింది. 

పురుషులే కాదు అర్థరాత్రి సమయంలో మహిళలు కూడా బైట నిర్భయంగా తిరుగలరు..మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తిరువంతపురంలో మహిళలు, యువతులు ‘నైట్ వాక్’ చేశారు. ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలకు మహిళలు ఎవ్వరూ  భయడపవద్దని ఈ నైట్ వాక్ ద్వారా మహిళలు చాటి చెప్పారు. పిలుపునిచ్చారు. 

ఢిల్లీలో డిసెంబర్ 16న సామూహిక అత్యాచారానికి గురైన ‘నిర్భయ’చికిత్స పొందుతూ సింగపూర్ హాస్పిటల్ లో డిసెంబర్ 29న కన్నుమూసింది. తనపై పాశవిక దాడి జరిగినా..అంతులేని మానసిక థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు నిర్భయ. ఒంటినిండా తీవ్ర గాయాలతో మృత్యవుతో పోరాడింది. తనకు ఆ దుస్థితి కలిగించిన దుర్మార్గులకు శిక్ష పడాలని కన్నూమూసే కడవరకు కోరుకుంది. అలా చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ కన్నూమూసింది. ఈ సందర్బంగా కేరళ మహిళా శిశు సంక్షేమ శాఖ ‘మహిళల నైట్ వాక్’ను ప్రదర్శించింది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ..మహిళలు ధైర్యంగా ఉండాలని చాటి చెబుతూ ఈ నైట్ వాక్ ను చేపట్టారు. జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళలు పోరాడాలని ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ పిలుపునిచ్చింది. మహిళల్లో ధైర్యాన్ని నింపింది.   మహిళలు ‘నిర్భయం’గా నడవగలరి ‘నైట్ వాక్’ద్వారా చాటి చెప్పారు. 

డిసెంబ‌రు 12, 2012 : స‌్నేహితుడితో క‌లిసి సినిమా చూసి తిరిగి వ‌స్తున్న మెడికో(నిర్భ‌య‌)పై 17 ఏళ్ల బాలుడు స‌హా ఆరుగురు వ్య‌క్తులు క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
డిసెంబ‌రు 29, 2012 : సింగ‌పూర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు (నిర్భ‌య‌) మృతి
 
మార్చి 11, 2013 : ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైలులో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు
 
ఆగ‌స్టు 31, 2013: ప‌్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గీతాంజ‌లి గోయ‌ల్ నేతృత్వంలోని జువెనైల్‌ జ‌స్టిస్ బోర్డ్ మెడికో రేప్ కేసులో బాలుడిని దోషిగా నిర్ధార్ధించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. స్పెష‌ల్ హోంలో మూడేళ్ల శిక్ష అనుభ‌వించాల‌ని తీర్పు చెప్పింది.
 
జ‌న‌వరి 29: ట‌్రాన్స్‌ఫ‌ర్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది
 
సెప్టెంబ‌రు 13, 2013: ఈ కేసులో మిగిలిన న‌లుగురు నిందితుల‌ను దోషులుగా నిర్ధారిస్తూ అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి యోగేష్ ఖ‌న్నా మ‌ర‌ణ‌శిక్ష విధించారు.
 
మార్చి 13, 2014: జ‌స్టిస్ రేవా ఖెట్రాపాల్‌, ప్ర‌తిభారాణి నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ట‌్ర‌య‌ల్ కోర్టు తీర్పును స‌మ‌ర్థించింది.
 
డిసెంబ‌రు 18, 2015: మూడేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న త‌ర్వాత బాలుడిని బ‌య‌ట‌కు వ‌ద‌ల‌కుండా నిర్బంధం విధించాల‌న్న పిటిష‌న్‌ను హైకోర్టు తిర‌స్క‌రించింది.
 
ఏప్రిల్ 3, 2016: 19 నెల‌ల‌పాటు నిశ్శ‌బ్దంగా ఉన్న ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదాన‌లు ప్రారంభ‌మ‌య్యాయి.
 
ఏప్రిల్ 8, 2016: సీనియ‌ర్ అడ్వ‌కేట్లు రాజు రాంచంద్ర‌న్‌, సంజ‌య్ హెగ్డేలు అమికస్ క్యూరియాలుగా నియ‌మితుల‌య్యారు.
 
ఆగ‌స్టు 29, 2016: సాక్ష్యాల‌ను పోలీసులు ట్యాంప‌రింగ్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో కోర్టు రూములో హైడ్రామా చోటుచేసుకుంది.
 
 
ఫిబ్ర‌వ‌రి 3, 2017: ఈ కేసును తిరిగి విచారించాల‌ని సుప్రీంకోర్టు నిర్ణ‌యించింది.
 
మార్చి 6, 2017: నిందితులంద‌రూ కోర్టులో అఫిడ‌విట్లు దాఖ‌లు చేశారు
 
 
మార్చి 27, 2017: సుప్రీంకోర్టు త‌న తీర్పును రిజ‌ర్వులో ఉంచింది
 
మే 5, 2017: ఈ కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. దోషుల‌కు హైకోర్టు విధించిన ఉరిశిక్ష‌ను విధిస్తూ చారిత్రాత్మ‌క‌మైన తీర్పును వెలువ‌రించింది.
కానీ నిర్భయ దోషులకు పలు కారణాలు ఇప్పటి వరకూ ఉరి శిక్ష అమలు కాలేదు.