Kerala Bank : నిలబడిన వ్యక్తి..ఒక్కసారిగా కిందపడిపోయాడు..ఆ తర్వాత
బిల్డింగ్ పై నిలబడిన ఓ వ్యక్తి అమాంతం..ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.

Kerala
Kerala was promptly saved : బిల్డింగ్ పై నిలబడిన ఓ వ్యక్తి అమాంతం..ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు. అతని పక్కనే నిల్చొన్న వ్యక్తులు షాక్ తిన్నారు. ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. అమాంతం..ఓ వ్యక్తి అలర్ట్ అయి…కిందపడిపోతున్న ఆ వ్యక్తి..అమాంతం కాళ్లు పట్టుకున్నాడు. కేరళలో జరిగిన ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
బిను అలియాస్ బాబు, బాబు రాజ్ ఇధ్దరూ..వడకరలోని కేరళ బ్యాంకు శాఖలో పనిచేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు కోసం..ఆ బ్యాంకు శాఖకు చెందిన తొలి అంతస్తులో నిలబడి ఉన్నారు. గోడకు నిల్చొన్న బాబు సృహ తప్పుతుండడం వీడియోలో కనిపించింది. అమాంతం వెనక్కు పడిపోయాడు. గమనించిన బాబు రావు వెంటనే అలర్ట్ అయ్యాడు. మొత్తం కిందపడిపోతున్న క్రమంలో..బాబు కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో అక్కడున్న వారు వచ్చి సహాయం చేసి పైకి లాగారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. భవనం మొదటి అంతస్తు కింద కరెంటు తీగలు కూడా ఉన్నాయి. సమయస్పూర్తితో వ్యవహరించిన బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
????? pic.twitter.com/9GPTce1xnt
— Anu Satheesh ?? (@AnuSatheesh5) March 19, 2021