Polyester For National Flag: దేశానికి ఖాదీ, జాతీయ జెండాకు చైనా పాలిస్టర్: మోదీపై రాహుల్ విమర్శలు
తాజాగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇంటింటి త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఇందుకు చైనాలో తయారైన పాలిస్టర్ జెండాలను దిగుమతి చేసుకుంది ప్రభుత్వం. వాస్తవానికి జాతీయ జెండా ఎప్పుడైనా ఖాదీలోనే ఉంటుంది. ఇదే ఆచారంగా వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం పాలిస్టర్ జెండాలను దిగుమతి చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Khadi for nation but chinese polyester for national flag says rahul on modi
Polyester For National Flag: ఖాదీ చుట్టమని దేశానికి పిలుపునిచ్చి.. చైనా పాలిస్టర్‌తో చేసిన జాతీయ జెండాలను దిగుమతి చేసుకోవడం ఏంటని ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ కీలక రాహుల్ గాంధీ మండి పడ్డారు. ప్రధాని మాటలకు చేతలకు అస్సలు పొంతన కుదరదని ఆయన విమర్శలు గుప్పించారు. శనివారం ఓ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రసంగిస్తూ దేశాన్ని ఆత్మనిర్భరం చేయడంతో పాటు మన కలల్ని సాధించాలంటే ఖాదీని ప్రోత్సహించాలని, దేశ ప్రజలంతా ఖాదీని ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ మాటల్ని రాహుల్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఆదివారం రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో.. ‘‘దేశానికేమో ఖాది. కానీ జాతీయ జెండాకు చైనా పాలిస్టర్. ఎప్పుడూ ఇంతే. ప్రధానమంత్రి మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండదు’’ అని ట్వీట్ చేశారు. తాజాగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇంటింటి త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఇందుకు చైనాలో తయారైన పాలిస్టర్ జెండాలను దిగుమతి చేసుకుంది ప్రభుత్వం. వాస్తవానికి జాతీయ జెండా ఎప్పుడైనా ఖాదీలోనే ఉంటుంది. ఇదే ఆచారంగా వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం పాలిస్టర్ జెండాలను దిగుమతి చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Congress President: అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక