హెల్మట్ ఎక్కడ?: ట్రాఫిక్ రూల్స్.. వాహనదారులకు కిరణ్ బేడీ క్లాస్

వాహనాలతో ఆ రోడ్డుంతా రద్దీగా ఉంది. బైక్ లు, ఆటోలు.. కార్లు, బస్సులు ఇలా ఎన్నో వాహనాలు రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా కొందరు ర్యాష్ డ్రైవ్ చేస్తూ దూసుకెళ్తున్నారు.

  • Published By: sreehari ,Published On : February 12, 2019 / 12:11 PM IST
హెల్మట్ ఎక్కడ?: ట్రాఫిక్ రూల్స్.. వాహనదారులకు కిరణ్ బేడీ క్లాస్

వాహనాలతో ఆ రోడ్డుంతా రద్దీగా ఉంది. బైక్ లు, ఆటోలు.. కార్లు, బస్సులు ఇలా ఎన్నో వాహనాలు రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా కొందరు ర్యాష్ డ్రైవ్ చేస్తూ దూసుకెళ్తున్నారు.

ఆ రోడ్డుంతా వాహనాల ట్రాఫిక్ తో రద్దీగా ఉంది. బైక్ లు, ఆటోలు.. కార్లు, బస్సులు.. ఎన్నో వాహనాలు రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా కొందరు ర్యాష్ డ్రైవ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. మరి కొంతమంది తమ బైకులపై ట్రిపుల్స్ గా వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డుపైకి ఓ పవర్ ఫుల్ ఉమన్ సడన్ గా ప్రత్యక్షమయ్యారు.

వాహనాలను కంట్రోల్ చేస్తూ అందరికి ట్రాఫిక్ రూల్స్ బోధిస్తున్నారు. త్రిబుల్స్ కనిపించినా.. హెల్మట్ పెట్టుకోలేదో వెంటనే బైక్ లను ఆపేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ట్రాఫిక్ పోలీసుగా అవతారమెత్తారు. రోడ్లపై వచ్చేపోయే వాహనాలను ఆపి మరి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. 

రోడ్డుప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాహనదారులకు ఆమె అవగాహన కల్పించారు. కిరణ్ బేడీ ట్రాఫిక్ పోలీసుగా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఢిల్లీలో కిరణ్ బేడీ మాజీ ఐఫీఎస్ అధికారిగా పనిచేశారు. అప్పట్లో ట్రాఫిక్స్ రూల్స్ విషయంలో చాలా కఠినంగా ఉండే పోలీసు అధికారిగా కిరణ్ బేడీ గుర్తింపు పొందారు. కిరణ్ బేడీ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న వీడియో ఇదే..