జలియన్ వాలాబాగ్ ఘటనకు 100ఏళ్లు : స్మారక నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల

వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన  జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు శనివారం వందేళ్లు నిండాయి.

  • Published By: venkaiahnaidu ,Published On : April 13, 2019 / 11:06 AM IST
జలియన్ వాలాబాగ్ ఘటనకు 100ఏళ్లు : స్మారక నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల

Updated On : April 13, 2019 / 11:06 AM IST

వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన  జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు శనివారం వందేళ్లు నిండాయి.

వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన  జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు శనివారం(ఏప్రిల్-13,32019)వందేళ్లు నిండాయి. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదని కోవింద్ అన్నారు.అమరులు గర్వపడే భారత్ నిర్మాణంలో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసేందుకు వారి త్యాగాలు తమకు స్పూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. 
Read Also : వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూలతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీఅమృత్‌స‌ర్‌లో ఉన్న జ‌లియ‌న్ వాలాబాగ్ స్మార‌కం దగ్గర నివాళులర్పించారు.అమృత్‌స‌ర్‌లో ఉన్న జ‌లియ‌న్ వాలాబాగ్ స్మార‌కం దగ్గర పలువురు ప్రముఖులు,పెద్ద సంఖ్యలో ప్రజలు అమరులకు నివాళులు అర్పిస్తున్నారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జలియన్ వాలాబాగ్ మెమోరియల్ ను సందర్శించి అమరులకు నివాళులర్పించారు.క్రూరఘటనకు 100ఏళ్లు సందర్భంగా 100రూపాయల స్మారక కాయిన్ ను,స్మారక పోస్టల్ స్టాంప్ లను విడుదల చేశారు.

బ్రిటీష్ హై క‌మిష‌న‌ర్ స‌ర్ డామినిక్ అస్క్విత్ కూడా జలియన్ వాలాబాగ్ స్మారకం దగ్గర పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. స్మార‌కం వ‌ద్ద ఉన్న విజిట‌ర్స్ బుక్‌ లో కూడా ఆయ‌న సంత‌కం చేశారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో స్థానికులు,పర్యాటకులు,విద్యార్థులు అమృత్ సర్ లో క్యాండిల్ లైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Also : Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి

బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్-13న జ‌లియ‌న్‌ వాలాబాగ్‌ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న భారతీయులపై జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ అత్యంత క్రూరంగా కాల్పుల‌కు ఆదేశించాడు. ఆ కాల్పుల్లో సుమారు వెయ్యి మందికిపైగా  మ‌ర‌ణించారు. చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.బ్రిటీష్ ఆక్రమణకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో జలియన్ వాలాబాగ్ క్రూర ఘటన ఓ చీకటి అధ్యాయంగా ఉండిపోతుంది. జ‌లియ‌న్‌ వాలాబాగ్ ఘ‌ట‌న భార‌త్‌, బ్రిటీష్ చ‌రిత్ర‌లో మాయ‌ని మ‌చ్చ అని రెండు రోజుల క్రితం బ్రిటీష్ ప్ర‌ధాని థెరిసా మే తెలిపారు. 1997లోనూ క్వీన్ ఎలిజ‌బెత్ జ‌లియ‌న్‌ వాలాబాగ్‌ ను విజిట్ చేసి నివాళి అర్పించారు. అయితే వందేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు జలియన్ వాలాబాగ్ ఘటనపై బ్రిటన్ అధికారికంగా భారత్ కు క్షమాపణ చెప్పలేదు.

Read Also : కొంప, కుటుంబం వద్దా రా : 12 గంటల డ్యూటీ చేసిన చైనా కంపెనీలు