దిగొస్తున్న డ్రాగన్….రాజ్ నాథ్‌తో చైనా రక్షణమంత్రి భేటీ!

India-China standoff: మూడు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో శుక్రవారం(సెప్టెంబర్-4,2020) సాయంత్రం మాస్కోలో చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీ సమావేశం కానున్నారు. మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు రాజ్‌నాథ్.. రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. చైనా రక్షణ మంత్రి కూడా SCO సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం రష్యా రాజధాని మాస్కోలో చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీ… భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తూర్పు లడఖ్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న వేళ.. రాజ్‌నాథ్ తో భేటీ కోసం చైనా ఫెంగీ సుముఖంగా ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ ఇరువురు మంత్రుల మధ్య సమావేశానికి చైనా పిలుపునివ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది
https://10tv.in/rafale-fighter-jets-to-be-formally-inducted-into-iaf-on-september-10-french-defence-minister-invited/
రాజ్‌నాథ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని చైనానే కోరినట్లు సమాచారం. ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశం కావాలనే తన అభీష్టాన్ని చైనా.. భారత అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.
కాగా, భారత్- చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి తొలి అత్యున్నత భేటీ ఇదే కానుంది. ఇంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున వాంగ్ యీ ఫోన్లో సంభాషించారు.