India Unemployment : శ్రమను గౌరవించకపోవటం వల్లే నిరుద్యోగం : RSS chief మోహన్‌ భాగవత్‌

India Unemployment : శ్రమను గౌరవించకపోవటం వల్లే నిరుద్యోగం : RSS chief మోహన్‌ భాగవత్‌

Dignity For Labour Causing Unemployment In Society Says RSS Chief Mohan Bhagwat

Updated On : February 6, 2023 / 9:37 PM IST

India Unemployment: శ్రమను గౌరవించకపోవటం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోంది అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసే శ్రమను, వృత్తిని గౌరవించాలని ఉద్యోగాల కోసం వెంపర్లాడవద్దు అంటూ సూచించారు. ప్రతీఒక్కరు అన్ని రకాల వృత్తులను..వారు వారు చేసే పనిని గౌరవించాలన్నారు. చదువుకున్న ప్రతీవారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకుంటున్నారని కానీ అది సాధ్యంకాదనే విషయం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ రంగం కేవలం 10 శాతం మాత్రమే ఉద్యోగాలు కల్పించగలదని ఇతర ఉద్యోగాలు మరో 20 శాతం ఉంటాయి. ప్రపంచంలో ఏ సమాజమూ 30 శాతానికి మించి ఉద్యోగాలను కల్పించలేదని ఈ విషయాన్ని తెలుసుకోవాలని మోహన్ భగవత్ సూచించారు.

మేధస్సుతో చేసేదైనా, శారీరక శ్రమతో చేసే కష్టమైనా దాన్ని ముందు గౌరవించాలన్నారు. పొట్ట కూటి కోసం కష్టపడి పనిచేసే పనిచేసేవారికి సమాజం పట్ల బాధ్యత ఉంటుందని.. సమాజం కోసం పనిచేసేటప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా ఉండదని అన్నారు. దేవుడు ముందు అందరూ సమానమేనని..కులం, వర్గం అన్న భేదం ఉండదని చెప్పుకొచ్చారు. నైపుణ్యాలు ఉంటే ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రతీ ఒక్కరు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని చూసించారు. కప్పులు కడిగే ఓ వ్యక్తి కష్టపడి ఓ పాన్ షాపు పెట్టుకుని రూ.28 లక్షలు సంపాదించాడని చేసే పని చిన్నది పెద్దది అనేది ఉండదు..చేసే పనిపై గౌరవం ఉంటే వారు ఉన్నతస్థాయికి చేరుకుంటారని సూచించారు.