MP Ranjita Koli : బిజెపి ఎంపిపై అర్థరాత్రి దుండగుల దాడి!

రాజస్థాన్ భరత్‌పూర్‌కు చెందిన బిజెపి ఎంపి రంజిత కోలిపై అర్థరాత్రి దుండగులు దాడి చేశారు. రంజిత కోలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి తిరిగి తన ఇంటికి చేరుకుంటున్న

MP Ranjita Koli : బిజెపి ఎంపిపై అర్థరాత్రి దుండగుల దాడి!

Mp Ranjita Koli

Updated On : May 28, 2021 / 8:52 AM IST

MP Ranjita Koli : రాజస్థాన్ భరత్‌పూర్‌కు చెందిన బిజెపి ఎంపి రంజిత కోలిపై అర్థరాత్రి దుండగులు దాడి చేశారు. రంజిత కోలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి తిరిగి తన ఇంటికి చేరుకుంటున్న సమయంలో.. ధర్సోని గ్రామ సమీపంలో కాపుకాచిన దుండగులు కారును అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. అనంతరం ప్రథమ చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఎంపీ సర్క్యూట్ హౌస్ చేరుకున్నారు.

కాగా సంఘటనపై మాట్లాడిన ఎంపి బృందం ఈ దాడి చాలా భయంకరంగా జరిగిందని, ఎంపి అపస్మారక స్థితిలోకి వెళ్లారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఘటనా స్థలానికి చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టిందని అన్నారు.. భరత్పూర్ డిఎంకు పదేపదే కాల్స్ చేసినప్పటికీ స్పందించలేదని ఎంపి బృందం ఆరోపించింది. కరోనా గణాంకాలను దాచిపెడుతున్నారంటు కొద్ది రోజులగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారామె.

Ranjeetha Koli

Ranjeetha Koli