LIC : పాల‌సీదారుడు చ‌నిపోతే.. ఇన్సూరెన్స్ డబ్బులు ఇలా క్లెయిమ్ చేసుకోండి..

ఎల్ఐసీ పాల‌సీ తీసుకున్న త‌ర్వాత మ‌ధ్య‌లో పాల‌సీదారుడు చ‌నిపోయాడా? మరి ఇన్సూరెన్స్ డ‌బ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నామినీ మాత్ర‌మే క్లెయిమ్ చేసుకోవాలా? కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అస‌లు దానికి ప్రొసీజర్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు అందరిలోనూ ఉంటాయి. కంగారు పడాల్సిన పని లేదు. డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి ఓ ప్రొసీజర్ ఉంది. ఆ వివరాలు మీ కోసం...

LIC : పాల‌సీదారుడు చ‌నిపోతే.. ఇన్సూరెన్స్ డబ్బులు ఇలా క్లెయిమ్ చేసుకోండి..

Lic

Updated On : August 6, 2021 / 9:02 AM IST

LIC Claim : ఎల్ఐసీ పాల‌సీ తీసుకున్న త‌ర్వాత మ‌ధ్య‌లో పాల‌సీదారుడు చ‌నిపోయాడా? మరి ఇన్సూరెన్స్ డ‌బ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నామినీ మాత్ర‌మే క్లెయిమ్ చేసుకోవాలా? కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అస‌లు దానికి ప్రొసీజర్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు అందరిలోనూ ఉంటాయి. కంగారు పడాల్సిన పని లేదు. డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి ఓ ప్రొసీజర్ ఉంది. ఆ వివరాలు మీ కోసం…

* ఎల్ఐసీ పాల‌సీదారుడు చ‌నిపోతే.. ఆ పాల‌సీదారుడు ఎవ‌రి పేరు అయితే నామినీగా ఇస్తారో వాళ్లు మాత్ర‌మే ఆ ఎల్ఐసీ డ‌బ్బుల‌ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
* ఎల్ఐసీ డెత్ క్లెయిమ్‌ను పూర్తిగా ఆఫ్ లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకునే సౌక‌ర్యాన్ని ఎల్ఐసీ క‌ల్పించింది.
* ముందు ఎల్ఐసీ పాల‌సీ క‌ట్టిన హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి వివ‌రాలు క‌నుక్కోవాలి.
* దాని కంటే ముందు.. పాల‌సీ తీసుకున్న పాల‌సీదారు ఏజెంట్ లేదా ఆ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌తో సంత‌కం పెట్టించుకొని అప్పుడు ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
* ముందు ఎల్ఐసీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి.. పాల‌సీదారుడు చ‌నిపోయిన విష‌యాన్ని బ్రాంచ్ మేనేజ‌ర్‌కు వెల్ల‌డించాలి. అప్పుడు బ్రాంచ్ అధికారులు.. ఫామ్ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌ల‌ను ఇస్తారు.

* ఆ ఫామ్‌లు నింపాక త‌ర్వాత వాటితో పాటు పాల‌సీదారుడి ఒరిజిన‌ల్ డెత్ స‌ర్టిఫికెట్‌, ఒరిజిన‌ల్ పాల‌సీ బాండ్, నామినీ పాన్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు లేదా ఓట‌ర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డు జిరాక్స్, చనిపోయిన పాల‌సీదారుడి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని.. అన్నింటి మీద నామినీ సంత‌కం పెట్టి.. ఎల్ఐసీ అధికారులు ఇచ్చిన ఫామ్‌ల‌తో పాటు వీటిని కూడా ఆఫీసులో సమ‌ర్పించాల్సి ఉంటుంది.

* అలాగే.. ఒక ఇంటిమేష‌న్ లెట‌ర్‌ను నామినీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అందులో పాల‌సీదారుడు చ‌నిపోయిన తేదీ, చ‌నిపోయిన ప్రాంతం, చ‌నిపోయిన కార‌ణం లాంటి వివ‌రాల‌తో ఆ లెట‌ర్ ఉండాలి. ఆఫీసు అధికారులు ఇచ్చిన నెఫ్ట్ ఫామ్‌లో నామినీ బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి.. అదే బ్యాంకుకు సంబంధించిన క్యాన్సిల్ చెక్, బ్యాంక్ పాస్ బుక్‌ను స‌మ‌ర్పించాలి. బ్యాంక్ పాస్‌బుక్‌లో కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నెంబ‌ర్‌, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ క‌నిపించేలా ఉండాలి.

* ఆఫీసులో డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించే స‌మ‌యంలో.. నామినీ, పాల‌సీదారుడికి సంబంధించిన ఒరిజిన‌ల్ ఐడీ కార్డుల‌ను వెంట తెచ్చుకోవాలి. వెరిఫికేష‌న్ కోసం ఒరిజిన‌ల్ కార్డుల‌ను అధికారులు చెక్ చేస్తారు. బ్యాంక్ ఒరిజిన‌ల్ పాస్ బుక్‌ను కూడా అధికారులు చెక్ చేశాక‌.. అప్పుడు డెత్ క్లెయిమ్‌కు సంబంధించిన అప్లికేష‌న్‌ను ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేస్తారు. నామినీ.. డాక్యుమెంట్ల‌ను స‌బ్మిట్ చేశాక‌.. అధికారులు ఇచ్చే రిసిప్ట్ ను కచ్చితంగా తీసుకోవాలి. భ‌విష్య‌త్తులో డెత్ క్లెయిమ్‌కు సంబంధించి అదే ప్రూప్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.