జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు..వారికి మాత్రమే

lifelong free tickets for military personnel : కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా పలు కంపెనీలు భారీ రాయితీలు ప్రకటిస్తున్నాయి. తాజాగా..థియేటర్ లో జీవితాంతం ఫ్రీగా సినిమా చూడొచ్చనే ఆఫర్ ప్రకటించింది. అయితే..ఇది సామాన్యులకు మాత్రం కాదు. త్రివిద దళాలకు చెందిన సైనికులకు మాత్రమే అని ఆ థియేటర్ ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని రెజెండ్ థియేటర్ యాజమాన్యం ఈ బంపర్ ఆఫర్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన సైనికులకు ఉచితంగా వినోదాన్నిపంచడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని థియేటర్ ఓనర్ సుమన్ కే సిన్హా వెల్లడించారు.
ఇదొక విధంగా తనకు ఆనందం కలుగు చేస్తోందని, గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారాయన. దేశ సేవలో సైనికులకు వినోదం పంచాలని, ఈ కొత్త ఆఫర్ వచ్చే సంవత్సరం 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. పాట్నాలోని దనాపూర్ రెజిమెంట్ లో సుమారు 1200 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు అంచనా. వీరు థియేటర్ కు వెళ్లి తమ ఐడీ కార్డును చూపించి థియేటర్ లోకి వెళ్లవచ్చన్నారు. సైనికుల కోసం ఉచితంగా సినిమా చూడొచ్చనే తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.