Lions Walk On Roads : రోడ్లపై సింహాల గుంపు హల్ చల్
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో పిపావావ్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి మూడు పెద్ద సింహాలు,రెండు పిల్ల సింహాలు రహదారిపై దర్జాగా తిరుగుతూ కనిపించాయి.

Lions
Lions Walk On Roads గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో పిపావావ్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి మూడు పెద్ద సింహాలు,రెండు పిల్ల సింహాలు రహదారిపై దర్జాగా తిరుగుతూ కనిపించాయి. హైవేపై సింహాల మందను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సింహాల గుంపు అలా నడుచుకుంటూ వెళ్లి పిపావావ్ ఓడరేవులోకి ప్రవేశించాయి. గాండ్రిస్తు పోర్ట్‌లో అటూ ఇటూ తిరిగాయి.
ఈ సింహాల మందని చూసిన అక్కడి కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది భయంతో వణికిపోయారు. వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆహారం కోసం వెతుక్కుంటూ సింహాలు రోడ్లపైకి వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
కాగా, గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోనే షేమస్ గిర్ అడవులు ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన పార్క్ లలో ఒకటైన గిర్ అడవులు ఆసియా జాతి సింహాలకు నివాసంగా ఉంది. ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లో సింహాల సంఖ్య 6-8శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020లో రాష్ట్రంలో సింహాల జనాభా 774గా ఉంది. 2019లో ఉన్న సింహాల సంఖ్య కన్నా ఇది 29 శాతం పెరుగుదల అని ఆ రాష్ట్ర అటవీశాఖ తెలిపింది.