లాక్ డౌన్ కారణంగా మెట్టినింటికి చేరుకోలేని భార్య…కోపంతో మరో పెళ్లి చేసుకున్న భర్త

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 12:19 PM IST
లాక్ డౌన్ కారణంగా మెట్టినింటికి చేరుకోలేని భార్య…కోపంతో మరో పెళ్లి చేసుకున్న భర్త

Updated On : April 20, 2020 / 12:19 PM IST

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే కొంతమంది లాక్ డౌన్ ను అర్థం చేసుకోకుండా పిచ్చి పనులు చేస్తున్నారు. భార్యకు దూరంగా ఉండలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా..మద్యానికి బానిసైన మరికొంతమంది మందు లేకపోవడంతో హంగామా చేశారు. తాజాగా లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం…బీహార్ లోని పాట్నా పాలీగంజ్ చెందిన ధీరజ్ కుమార్ కు దుల్హిన్ బజార్ కు చెందిన యువతితో ఇటీవలే వివాహం అయింది. కొన్ని రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. అనంతరం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఆమె పుట్టింటి దగ్గరే ఉండాల్సివచ్చింది. అయితే అసహనానికి గురైన ధీరజ్..భార్యకు పలుమార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు.  

భార్య రాకపోవడంతో మరింత అసహనానికి గురయ్యాడు. మాజీ ప్రియురాలును ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు.  కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.