జైలు లాక్‌డౌన్‌: నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు పూర్తి

  • Published By: vamsi ,Published On : March 19, 2020 / 11:51 PM IST
జైలు లాక్‌డౌన్‌: నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు పూర్తి

Updated On : March 19, 2020 / 11:51 PM IST

నిర్భయ దోషుల ఉరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తిహార్‌ జైలు అధికారులు స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే అధికారులు జైలును లాక్‌డౌన్‌ చేశారు. జైలు బయట జనం పెద్ద సంఖ్యలో చేరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తిహార్‌ జైలు ఎదుట సీఆర్పీఎఫ్‌ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.(వాళ్లు రేపటి సూర్యున్ని చూడలేరు..: ఆఖరి అవకాశం అయిపోయింది.. ఇక ఉరే!)

కొద్ది క్షణాల్లో ఉరి తీయ్యనుండగా.. వారిని ఉరికంబాలు ఉన్న చోటుకు తీసుకుని వచ్చారు జైలు అధికారులు. తలారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.