లోక్ సభ సమావేశాలు : విపక్షాల ఆందోళన..గందరగోళం

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18వ తేదీ సోమవారం ఉభయసభలు ప్రారంభం కాగానే..ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సభలు ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం లోక్ సభలో కొత్తగా ఎన్నికైన వారిచే స్పీకర్ ప్రమాణం చేయించారు. తర్వాత..ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు భాషను తప్పనిసరి చేశారని, తెలుగు భాషా పరిరక్షణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలని, త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని సభకు తెలిపారు.
స్పీకర్ ప్రశ్నోత్తరాలను కంటిన్యూ చేయడంతో వివిధ అంశాలపై చర్చించాలని సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై కేంద్ర మంత్రి పోఖ్రియాల్ జోక్యం చేసుకున్నారు. తెలుగు భాషా ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, స్పీకర్ ఎప్పుడు అనుమతినిస్తే..చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో వెల్లడించారు. కానీ సభ్యులు శాంతించలేదు. చర్చకు అనుమతినిస్తానని, సభ్యులు ఆందోళనను ఉపసంహరించాలని స్పీకర్ సూచించారు. సభ్యుల ఆందోళన మధ్యే..స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
> ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.
> మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలపై శివసేన.
> ఫరూక్ అబ్దుల్లా విడుదలపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
Read More : రణం లేదు శరణమే : శబరిమల..నవంబర్ 20 టెన్షన్