ఎన్నికల ప్రచారం : ఆటోలో ప్రకాష్ రాజ్ ప్రచారం

చెన్నై : విలక్షణ నటుడుగా పేరొందిన ప్రకాష్ రాజ్ అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. ఏ పార్టీల చేరనని ప్రకటించిన ఈ నటుడు సొంతంగానే బరిలోకి దిగేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటన ప్రారంభించారు. ముందుగా సెగ్మెంట్‌లోని ఓ పార్క్ వద్ద తనకి మద్దతు ఇచ్చేవారితో కలిసి ప్రజా ప్రణాళిక పేరిట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది ఆటోలతో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ఆటోలను మహిళలే నడపడం విశేషం. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్.. ప్రజలతో కలవడం వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.