2024 Lookback Politics: ఈ ఏడాది ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఇవే.. ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచాయో తెలుసా?

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది ప్రపంచం. మరో మూడు వారాల్లో 2025 ఏడాది వచ్చేస్తోంది.

2024 Lookback Politics: ఈ ఏడాది ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఇవే.. ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచాయో తెలుసా?

Updated On : December 19, 2024 / 4:02 PM IST

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది ప్రపంచం. మరో మూడు వారాల్లో 2025 ఏడాది వచ్చేస్తోంది. ఈ ఏడాది భారత్‌లో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయో, ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలిచాయో చూద్దామా?

ఈ ఏడాది మొత్తం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, జమ్మూకశ్మీర్, హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరగగా.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ/ఎన్డీఏ విజయ దుందుభి మోగించింది.

* అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రేమాఖండు సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు.

* సిక్కింలో ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. సిక్కిం క్రాంతికారీ మోర్చా మరోసారి ఎన్నికల్లో గెలిచింది. దీంతో ప్రేమ్ సింగ్ తమంగ్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరిగాయి. వైసీపీని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఓడించింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

* ఒడిశాలో మే 13, జూన్‌ 1న పోలింగ్ జరిగింది. బీజూ జనతాదళ్‌ను బీజేపీ ఓడించింది. నవీన్ పట్నాయక్‌ సుదీర్ఘ పాలనకు ముగింపు పడింది. మోహన్ చరణ్ మాంఝీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

* జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబరు 18, అక్టోబరు 1న ఎన్నికలు జరిగాయి. అంతకుముందు రాష్ట్రపతి పాలన ఉండేది. ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచి ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

* హరియాణాలో అక్టోబరు 5న ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. నయాబ్‌ సింగ్‌ సైనీ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

* ఝార్ఖండ్‌లో నవంబరు 13, 20న ఎన్నికలు జరిగాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. హేమంత్‌ సొరేన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

* మహారాష్ట్రలో నవంబరు 20న ఎన్నికలు జరిగాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Rahul Gandhi Video: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రోజా పువ్వు ఇచ్చి రాహుల్ గాంధీ నిరసన