కొత్త పాస్ పోర్టుల్లో కమలం గుర్తు…అందుకే!

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2019 / 01:41 AM IST
కొత్త పాస్ పోర్టుల్లో కమలం గుర్తు…అందుకే!

Updated On : December 13, 2019 / 1:41 AM IST

నూతనంగా జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌ల్లో కమలం గుర్తును ముద్రించడంపై లోక్ సభ వేదికగా ప్రతిపక్ష సభ్యులు లేవవనెత్తడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగంగానే కమలం గుర్తును ముద్రించడం జరిగిందని తెలిపింది. 

కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్‌ పద్దతిలో  ఈ అంశాన్ని బుధవారం లోక్‌సభలో  కాంగ్రెస్‌ సభ్యుడు ఎంకే రాఘవన్‌ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయని, ఇది ప్రభుత్వ కాషాయీకరణలో భాగమని విమర్శించిన విషయం తెలిసిందే.