Viral Video: స్టవ్ పై ఎక్కడంటే అక్కడే వేడివేడి సమోసాలు రెడీ

ఏకంగా.. స్టవ్, సలసల కాగే నూనె కళాయిని చేత్తో పట్టుకు తిరుగుతూ ఎక్కడంటే అక్కడ వేడి వేడి సమోసాలు అమ్ముతున్నాడు ఆ యువకుడు.

Viral Video: సమోసాలంటే మనకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చల్లని సాయంత్రంవేళ.. వేడి వేడి సమోసా, చాయ్ తాగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాం. సమోసా వేడిగా ఉన్నపుడు తింటేనే ఆ మజాను ఆస్వాదించగలం. ఈ అనుభవాన్ని తన కస్టమర్లకు అందివ్వాలనుకున్నాడు సమోసాలు అమ్మే ఓ యువకుడు. అందుకే ఏకంగా.. స్టవ్, సలసల కాగే నూనె కళాయిని చేత్తో పట్టుకు తిరుగుతూ ఎక్కడంటే అక్కడ వేడి వేడి సమోసాలు అమ్ముతున్నాడు ఆ యువకుడు. చేత్తో మొబైల్ కిచెన్ నడుపుతున్న ఆ యువకుడి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also read: Myanmar unrest: వారం వ్యవధిలో భారత్ లోకి ప్రవేశించిన 8000 మంది మయాన్మార్ శరణార్థులు

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువకుడు సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అందరిలా పెద్ద దుకాణం ఏర్పాటు చేసుకునే స్తోమత లేదు. పోనీ రోడ్డు ప్రక్కన చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుందామంటే.. మున్సిపాలిటీ సిబ్బంది నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయోననే భయం. దీంతో ఓ ఉపాయం ఆలోచించిన యువకుడు.. చేతిలో ఇమిడిపోయేలా ఒక చిన్న స్టవ్, నూనె కళాయి కొనుక్కుని.. ఎక్కడంటే అక్కడే సమోసాలు తయారు చేసుకునేలా.. ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో జనం గుంపులు, బాగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లి వేడి వేడి సమోసాలు అమ్మేస్తున్నాడు ఆ యువకుడు. పది రూపాయలకు నాలుగు సమోసాలు అమ్ముతూ అటు జనం కడుపు నింపుతూ ఇటు తన జేబు నింపుకుంటున్నాడు ఆ యువకుడు.

Also read: oppo Smartphones: మార్కెట్లోకి విడుదలైన ఒప్పో రెనో 7 ప్రో: ధర మరియు ఫీచర్లు

యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేసే గౌరవ్ వాసన్.. ఇటీవల ఈ యువకుడి వద్ద సమోసాలు కొనుగోలు చేశాడు. యువకుడి ఆలోచనకు ఫిదా అయిన గౌరవ్..యువకుడిలోని ప్రతిభను, శ్రమను నలుగురికీ చేరేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అది చూసిన నెటిజన్లు..సమోసా అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ యువకుడి వీడియోలను చూసి.. “ఎంతో కష్టపడుతున్నావు.. నువ్వు జీవితంలో ఇంకా పైకి వస్తావు” అంటూ ఒకరు కామెంట్ చేయగా..”మనసుంటే మార్గం ఉంటుందని నువ్వు నిరూపించావు” అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also read: TDP Politics: ప్రభుత్వ సాయం లేకనే చేనేత కుటుంబ ఆత్మహత్య: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

ట్రెండింగ్ వార్తలు