Myanmar unrest: వారం వ్యవధిలో భారత్ లోకి ప్రవేశించిన 8000 మంది మయాన్మార్ శరణార్థులు

ఒక్క వారం వ్యవధిలోనే 8,149 మంది మయాన్మార్ శరణార్థులు మిజోరాంలోని జోఖౌతార్ గ్రామానికి చేరుకున్నారంటే మయాన్మార్ లోని పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది.

Myanmar unrest: వారం వ్యవధిలో భారత్ లోకి ప్రవేశించిన 8000 మంది మయాన్మార్ శరణార్థులు

Myanamr

Myanmar unrest: మయాన్మార్ దేశంలో సైనిక పాలన..రాక్షస పాలనను తలపిస్తుంది. తమకు ఎదురు తిరుగుతున్న ప్రజలపై మయాన్మార్ జుంటా కాల్పులకు తెగబడుతుంది. గ్రామాలకు గ్రామాలనే సైనికులు తగలబెడుతున్నారు. ముఖ్యంగా భారత్ లోని మిజోరంతో సరిహద్దు పంచుకుంటున్న చిన్ రాష్ట్రంలో మయాన్మార్ సైనికులు మారణహోమం సృష్టిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పలు గ్రామాల్లోని ప్రజలు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్ లోకి శరణార్థులుగా వస్తున్నారు. ఒక్క వారం వ్యవధిలోనే 8,149 మంది మయాన్మార్ శరణార్థులు మిజోరాంలోని జోఖౌతార్ గ్రామానికి చేరుకున్నారంటే మయాన్మార్ లోని పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది.

Also read: oppo Smartphones: మార్కెట్లోకి విడుదలైన ఒప్పో రెనో 7 ప్రో: ధర మరియు ఫీచర్లు

మిజోరాంలోని చంపాయ్ జిల్లా.. మయాన్మార్ తో సరిహద్దు పంచుకుంటుంది. ఇటీవల మయాన్మార్ లోని హైమువల్, రిహ్ మరియు ఖౌమావి గ్రామాల్లో కాల్పులు, బాంబు దాడులు జరిగాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో శరణార్థులుగా మిజోరాంలోని జోఖౌతార్ గ్రామానికి చేరుకున్నారు. అయితే శరణార్థులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో స్థానిక అధికారులు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదు. అదే సమయంలో శరణార్థిగా వచ్చిన వారిని మానవతా దృక్పధంతో స్పందించి వెనక్కు పొమ్మని చెప్పలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మంది మయాన్మార్ శరణార్థులను ఆదుకునేందుకు చంపాయ్ జిల్లా ప్రజలు ముందుకు వచ్చారు.

Also read: TDP Politics: ప్రభుత్వ సాయం లేకనే చేనేత కుటుంబ ఆత్మహత్య: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

శరణార్ధులకు ఆశ్రయం కల్పిస్తూ.. స్థానిక గ్రామాల ప్రజలు సహాయక చర్యలు అందిస్తున్నారు. అయితే ఏకకాలంలో ఎక్కువమంది శరణార్థులు వస్తుండడంతో గ్రామస్తుల వద్దనున్న సౌకర్యాలు సైతం సరిపోవడం లేదు. అక్కడక్కడా ఖాళీ స్థలాలు, పాత భవనాలు, ఖాళీ ఉన్న పాఠశాలల్లో శరణార్ధులకు ఆశ్రయం కల్పించి..ఆహారం, నీరు, బట్టలు అందిస్తున్నారు. అయితే మిజోరంలోని స్థానిక అధికారులు స్పందిస్తూ.. భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన.. ఆదేశాలు లేకున్నా.. మానవతా దృక్పధంతో శరణుకోరి వచ్చిన వారిని వెనక్కు పంపించడం లేదని అన్నారు. అదేసమయంలో కొందరు శరణార్థులు వస్తూపోతూ ఉన్నారని.. దీంతో వారికి ఎలా ఆశ్రయం కల్పించాలి తమకు అర్ధం కావడం లేదని చంపాయ్ జిల్లా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మయాన్మార్ తో ఉన్న మూడు సరిహద్దుల గుండా.. ఆరు గ్రామాల నుంచి శరణార్థులు మిజోరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

Also read: Gujarat Businessman: పద్మశ్రీ వ్యాపారవేత్తకు కుటుంబ సభ్యులు “హెలికాప్టర్ గిఫ్ట్”, దాన్ని ఏం చేశాడంటే?