oppo Smartphones: మార్కెట్లోకి విడుదలైన ఒప్పో రెనో 7 ప్రో: ధర మరియు ఫీచర్లు

ప్రీమియం సెగ్మెంట్ రేంజ్ లో "రెనో 7 సిరీస్ ఫోన్లను" ఒప్పో శుక్రవారం భారత్ లో విడుదల చేసింది. రెనో 7, రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.

oppo Smartphones: మార్కెట్లోకి విడుదలైన ఒప్పో రెనో 7 ప్రో: ధర మరియు ఫీచర్లు

Oppo Smartphones

oppo Smartphones: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ oppo భారత్ లో మార్కెట్ వాటాను పెంచుకునేందుకుకే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రోడక్ట్ రేంజ్ పెంచాలని భావిస్తుంది. బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది oppo. ఈక్రమంలో ప్రీమియం సెగ్మెంట్ రేంజ్ లో “రెనో 7 సిరీస్ ఫోన్లను” ఒప్పో శుక్రవారం భారత్ లో విడుదల చేసింది. రెనో 7, రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.

Also read: TDP Politics: ప్రభుత్వ సాయం లేకనే చేనేత కుటుంబ ఆత్మహత్య: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

ఒప్పో రెనో 7 ప్రో ప్రత్యేకతలు:
6.5-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ వస్తుంది. 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంది. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ లోనే ఈ రెనో 7 ప్రో లభిస్తుంది. డైమెన్సిటీ ప్రాసెసర్, 5G టెక్నాలజీతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 50MP.. సోనీ IMX766 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ మరియు డెడికేటెడ్ కలర్ టెంపరేచర్ సెన్సార్ వంటి ఫీచర్లు వెనుక కెమెరాలో ఉన్నాయి. ఇక ముందు భాగంలో సోనీ IMX709 సెన్సార్ కలిగిన 32MP కెమెరా ఉంది.

Also read: Gujarat Businessman: పద్మశ్రీ వ్యాపారవేత్తకు కుటుంబ సభ్యులు “హెలికాప్టర్ గిఫ్ట్”, దాన్ని ఏం చేశాడంటే?

5G, WiFi 6, USB-టైప్ C సాంకేతికతతో పాటు..ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్న ఈ oppo రెనో 7 ప్రో ధరను రూ. 39,999గా నిర్ణయించింది సంస్థ. బ్యాంకు, క్రెడిట్ కార్డు ఆఫర్లను వాడుకుంటే 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. భారత్ లోని కమర్షియల్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి సంస్థ వెబ్ సైట్ లోనూ..ఇతర ఈ కామర్స్ సైట్ లలోనూ ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.