కారులో మంటలు : భార్య సజీవ దహనం.. భర్త, పిల్లలు సేఫ్

కర్ణాటక బీదర్ జిల్లా చిడుగుప్ప జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హైదారాబాద్ నార్శింగ్ కు చెందిన కళ్యాణి సజీవంగా దహనమైపోయింది. ఈ ప్రమాదం నుంచి కళ్యాణి భర్త ఉదయ్ కుమార్, కుమారులు, సంజీవ్, గగన్ లు తృటిలో తప్పించుకున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో నాసిక్ నుంచి సొంత ఊరికి బయల్దేరారు. మార్గ మధ్యలో కర్ణాటకలోని బీదర్ జిల్లా మనేక్కెల్లి నిర్నా క్రాస్ రోడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎక్కువ అవ్వటంతో కళ్యాణి బయటకు రాలేకపోయింది. కానీ భర్త ఉదయ్ కుమార్, ఇద్దరు పిల్లలు సంజీవ్, గగన్ లు సురక్షితంగా బైటపడ్డారు.
కళ్ల ముందే భార్య సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేక ఉదయ్ కుమార్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని కారులో మంటలు ఎలా చెలరేగాయి అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.