వావ్..ఈ మెషీన్ ముందు గుంజీలు తీస్తే..ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీ: రైల్వే శాఖ కొత్త ఐడియా

ఎవరినైనా రైల్ ఎక్కించటానకి వెళ్లాలన్నా..లేదా రైలులో వచ్చినవారిని రిసీవ్ చేసుకోవటానికి వెళ్లాలన్నా స్టేషన్ లోపలికి వెళితే..కచ్ఛితంగా రైల్వే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సిందే. కానీ ప్లాట్‌ఫామ్ టికెట్ రేటు రైల్వే శాఖ పెంచేయటంతో టికెట్ కొనటానికి చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ అటువంటి ప్లాట్‌ఫామ్ టికెట్ ఫ్రీగా పొందే వెసులుబాటు వచ్చింది.
కానీ అది ఫ్రీగా ప్లాట్ ఫాం టికెట్ పొందాలంటే కొంచెం కష్టపడాల్సిందే. ఏం లేదండీ..ప్లాట్ ఫాం టికెట్లు జారీ చేసే మెషీన్ల ముందు కొంచెంసేపు గుంజీలు తీస్తే చాలు.. ఆ మిషన్ ప్లాట్‌ఫామ్ టికెట్‌ను ఫ్రీగా ఇచ్చేస్తుంది. అఫ్ కోర్స్..గుంజిళ్లు తీయటం ఆరోగ్యానికి చాలా మంచిదే కదా..ఆరోగ్యానికి ఆరోగ్యం..ప్లాట్ ఫాం టికెట్ ఫ్రీ. ప్లాట్ ఫాం టికెట్ ఫ్రీగా ఇవ్వాలని ఆలోచించిన రైల్వే శాఖ ఉద్ధేశం కూడా అదే.
వివరాల్లోకెళితే.. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త ఆలోచనకు అమలుకు శ్రీకారం చుడుతోంది. దీంట్లో భాగంగానే ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఓ మిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ మిషన్ ముందు నిలబడి కొంచెంసేపు గుంజీళ్లు తీస్తే ప్లాట్ ఫాం టిక్కెట్ ఫ్రీగా వచ్చే ఈ కొత్త ప్రయోగానికి తెరలేపంది రైల్వే శాఖ. గుంజీలు తీస్తే ఫ్రీగా ప్లాట్‌ఫామ్ టికెట్ జారీ అయ్యేలా సరికొత్త టికెట్ యంత్రాలను ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు.
ఆ మెషీన్ ముందు ఎవరైనా సరే కొన్ని గుంజీలు తీసినట్లైతే దానంతట అదే టికెట్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దీని ద్వారా డబ్బు సేవ్ అవడంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది’ అంటూ గోయల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
फिटनेस के साथ बचत भी: दिल्ली के आनंद विहार रेलवे स्टेशन पर फिटनेस को प्रोत्साहित करने के लिए अनूठा प्रयोग किया गया है।
यहां लगाई गई मशीन के सामने एक्सरसाइज करने पर प्लेटफार्म टिकट निशुल्क लिया जा सकता है। pic.twitter.com/RL79nKEJBp
— Piyush Goyal (@PiyushGoyal) February 21, 2020