Bengaluru : లాక్ డౌన్ ఉల్లంఘన, లాఠీ దెబ్బలు కాదు..కొత్త పూజ

బెంగళూరు నగర శివారులో మదయాకనహళ్లి పోలీస్ స్టేషన్ ఉంది. తనిఖీల్లో భాగంగా..రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలగానే..వారి ముందు పోలీసులు ప్రత్యక్షమవుతారు.

Bengaluru : లాక్ డౌన్ ఉల్లంఘన, లాఠీ దెబ్బలు కాదు..కొత్త పూజ

Bengaluru Police

Updated On : May 24, 2021 / 9:22 PM IST

Lockdown Violators : భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ మరింత కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్ డౌన్, కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొంతమంది డోంట్ కేర్ అంటూ..అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వీరికి కొంతమంది పోలీసులు లాఠీ దెబ్బలు చూపిస్తున్నారు. లాఠీలతో చితకబాదుతున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే…బెంగళూరు పోలీసులు కొత్త టెక్నిక్ ను ప్రయోగించారు.

బెంగళూరు నగర శివారులో మదయాకనహళ్లి పోలీస్ స్టేషన్ ఉంది. తనిఖీల్లో భాగంగా..రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలగానే..వారి ముందు పోలీసులు ప్రత్యక్షమవుతారు. ఒకరు వచ్చి మెడలో దండ వేస్తారు. అరే..గిదేంది అని అనుకోగానే..మరో పోలీస్ వచ్చి…హారతి పళ్లెంతో వచ్చి..నుదుటిపై బొట్టు పెడుతారు.

అసలు ఏం జరుగుతోంది ? అంటూ మనస్సులో అనుకుంటూ ఉండగానే..అక్షింతలు వేసి హారతి ఇస్తారు. అంటే లాఠీ దెబ్బలకు బదులు నిజంగానే పూజలు చేస్తున్నారు ఈ పోలీసులు. లాక్ డౌన్ ఎందుకు విధించారు ? అనవసరంగా రోడ్ల మీదకు వస్తే..ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read More : Yawning Mystery : ఆవలింత.. ఎవరైనా ఆవలిస్తే.. మీరూ ఎందుకు ఆవలిస్తారు? కారణం తెలిసిందోచ్..!