బోరు బావిలో పడిపోయిన మూడేండ్ల బాలుడు

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 07:16 PM IST
బోరు బావిలో పడిపోయిన మూడేండ్ల బాలుడు

Updated On : November 5, 2020 / 12:49 PM IST

Madhya Pradesh 3-year-old boy falls : వేసిన బోరు బావిలను అలాగే వదిలేయకుండా మూసేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడుతుండగా మరికొంత మంది ప్రాణాలు పోతున్నాయి. తాజాగా..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడేండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.



200 ఫీట్ల లోతులో బోరు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తమ కొడుకు క్షేమంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Niwadi జిల్లాలో Prithivipur లో హరికిషన్ కుటుంబం నివాసం ఉంటోంది. హరికిషన్ దంపతులకు ప్రహ్లాద్ (3) కొడుకున్నాడు. ఐదు రోజుల క్రితం..పొలంలో బోర్ ను తవ్వించారు. 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం ఉదయం ఆడుకుంటూ..ప్లహ్లాద్ అందులో పడిపోయాడు.



సంఘటన జరిగిన తర్వాత..జిల్లా అధికారులు, ఆర్మీ సిబ్బంది, Disaster Response Force, National Disaster Response Force అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారిని చేరుకోవడానికి బోర్ వెల్ పక్కనే సమాంతరంగా సొరంగం తవ్వుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ కెమెరా ద్వారా చూడగా..బాలుడు తలకిందులుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. 50 నుంచి 60 అడుగుల లోతులో పిల్లవాడు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు, ఆర్మీ సిబ్బంది వెల్లడిస్తున్నారు.



బోర్ వెల్ లో 100 అడుగుల వరకు నీరు ఉందని గుర్తించినట్లు, కానీ..పిల్లవాడు ఎక్కడ ఇరుక్కపోయాడో తెలియడం లేదని Prithvipur police station in-charge నరేంద్ర త్రిపాఠి వెల్లడించారు. అరడజను యంత్రాలతో యుద్ధప్రాదికన చర్యలు చేపడుతున్నారు. నా బిడ్డను క్షేమంగా తీసుకరావాలని తల్లి Kapuri Kushwaha అధికారులను కోరుతోంది.



దీనిపై సీఎం శివరాజ్ సింగ్ స్పందించారు. సైన్యంతో పాటు స్థానిక అధికారులు బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారని ట్వీట్ చేశారు. చిన్నారిని త్వరగానే క్షేమంగా బయటకు తీస్తారనే నమ్మకం వెలిబుచ్చారు. ఆ బాలుడికి దీర్ఘాయువు ఇవ్వాలని, దీని కోసం మనమంతా ప్రార్థిద్దామన్నారు.