Madhya Pradesh : నోట్ల కట్టలను విసిరేసిన వృద్ధుడు, వీడియో వైరల్

డబ్బులతో పాటు..ఏవో కాగితాలను కూడా కోపంగా విసిరేశాడు. వంద, యాభై, ఇరవై, పది రూపాయలు అందులో ఉన్నాయి. భారీగా డబ్బులను విసిరేస్తుండగా...

Madhya Pradesh : నోట్ల కట్టలను విసిరేసిన వృద్ధుడు, వీడియో వైరల్

Beggar

Updated On : December 21, 2021 / 1:55 PM IST

Beggar Rain Note: ఓ వృద్ధుడు రోడ్డుపై డబ్బులను విసిరేస్తున్నాడు. రోడ్డుపై విచ్చలవిడిగా ఎగరేస్తూ..కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు డబ్బులను అలా ఎగరేస్తున్నాడో అర్థం కాలేదు. ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైని నగరంలో జరిగింది. నాగదా రైల్వే స్టేషన్ బయట ఓ వృద్ధుడు గద్దెపై కూర్చొని ఉన్నాడు. ఏమైందో ఏమో…అతని బట్టలో ఉన్న డబ్బులను విసిరేశాడు.

Read More : India : గుడ్ న్యూస్..వారానికి నాలుగు రోజులే పని దినాలు..కొత్త లేబర్ కోడ్!

డబ్బులతో పాటు..ఏవో కాగితాలను కూడా కోపంగా విసిరేశాడు. వంద, యాభై, ఇరవై, పది రూపాయలు అందులో ఉన్నాయి. భారీగా డబ్బులను విసిరేస్తుండగా…chaturesh tiwari అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షణాల్లో ఇది వైరల్ గా మారింది. అయితే..ఎవరూ కూడా ఆ నోట్లను ముట్టుకోలేదు. అలా చేయవద్దని కొంతమంది చెప్పారు. కానీ అతను పట్టించుకోలేదు. అతనికి మతిస్థిమితం లేనట్లుగా ఉన్నాడు. సమాచారం అందుకున్న GRP టీం అక్కడకు చేరుకుని నోట్లను ఏరి..అతనికిచ్చి..అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.