అప్పు తిరిగి అడిగితే..గొంతు పిసికెయ్యండి: రైతులకు బీజేపీ ఎంపీ సలహా

‘కిసాన్ ఆక్రోష్ ఆందోళన్’ కార్యక్రమంలో రేవా బీజేపీ ఎంపీ మిశ్రా మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల రుణ మాఫీ విషయంపై మాట్లాడిన మిశ్రా..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభతు్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ విమర్శించారు. అంతటితో ఊరుకోలేదు. రుణాల వసూలు కోసం రైతుల దగ్గరు వస్తే..ఆ వచ్చిన వారు ఎవరైనా సరే వారిపై విరుచుకుపడండంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
రైతుల నుంచి రుణాలు వసూలు చేసేందుకు పోలీసులు వచ్చినా..అధికారులు వచ్చినా వారి చేతులు విరగ్గొట్టమనీ..వారి గొంతులు పట్టుకుని నులిమేయమని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలైనా ఏమాత్రం విడిచిపెట్టవద్దనీ..ఆఖరికి పోలీసులు మిమ్మల్ని రుణాల గురించి అడిగితే వాళ్ల చేతులు విరగ్గొట్టండి. వారి పీకలు నులిమేయండి. మీరు ఎవరికీ భయపడవద్దు..మీ కోసం బీజేపీ అండగా ఉంటుంది.
బీజేపీ కార్యకర్తలు రైతులకు అండగా నిలబడతారని మిశ్రా అన్నారు. కాంగ్రెస్ చేసే రాజకీయాలను ఏమాత్రం సహించి ఊరుకునేది లేదని..ఎంపీ మిశ్రా హెచ్చరించారు.