మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ… కొత్తగా 20 మందికి అవకాశం

Madhya Pradesh cabinet expansion today, confirms CM Mohan Yadav: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్ ను సోమవారం విస్తరించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 20 మందికి చోటు కల్పించవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి....

Madhya Pradesh Cabinet Expansion

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్ ను సోమవారం విస్తరించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 20 మందికి చోటు కల్పించవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి మంత్రివర్గ విస్తరణ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా సీనియర్ బిజెపి నాయకులతో సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గ విస్తరణ విషయాన్ని ధృవీకరించారు.

ALSO READ : Married : సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి

సమావేశం అనంతరం సీఎం యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ,ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో 2024లో కేంద్రంలో బీజేపీ మరోసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, నర్సింగపూర్ ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఇండోర్ 1 స్థానం నుంచి ఎమ్మెల్యే కైలాష్ విజయవర్గియా, జగదీష్ దేవరా , రాజేంద్ర శుక్లా, సాగర్ జిల్లాలోని రహ్లీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం లభించనుందని పార్టీవర్గాలు తెలిపాయి.

ALSO READ : Sudarsan Pattnaik : క్రిస్మస్ పర్వదినాన పూరి బీచ్‌లో శాంతాక్లాజ్ సైకత శిల్పం

గోపాల్ భార్గవ,ప్రద్యుమన్ సింగ్ తోమర్, కృష్ణ గౌర్, రామేశ్వర్ శర్మ, కమల్ మార్స్కోల్, గాయత్రి పవార్, ఘనశ్యామ్ చంద్రవంశీ, సంపతీయ ఉయికే, దినేష్ రాయ్ మున్మున్, అభిలాష్ పాండే, రీతి పాథక్, రాకేష్ సింగ్ మంత్రివర్గంలో చోటు లభించవచ్చని సమాచారం.మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రితో సహా మొత్తం 34 మంది మంత్రులు ఉండవచ్చు. డిసెంబర్ 13వతేదీన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిజెపి ఎమ్మెల్యే మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడంతో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శకం ముగిసింది.

ALSO READ : Jammu and Kashmir : జమ్మూ కశ్మీరులో ఆర్మీ చీఫ్ పర్యటన…ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు

కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ సీఎం యాదవ్ ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌లను కలిశారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి డిసెంబర్ 22న దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు పథకాలపై చర్చించారు.