జమ్మూ కశ్మీరులో ఆర్మీ చీఫ్ పర్యటన…ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు

Indian Army Chief Manoj Pande: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ సోమవారం జమ్మూ పర్యటనకు వచ్చారు. సోమవారం జమ్మూకశ్మీరులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ సమీక్షించారు.....

జమ్మూ కశ్మీరులో ఆర్మీ చీఫ్ పర్యటన…ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు

Updated On : December 25, 2023 / 11:46 AM IST

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ సోమవారం జమ్మూ పర్యటనకు వచ్చారు. సోమవారం జమ్మూకశ్మీరులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ సమీక్షించారు. జమ్మూ,కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ప్రస్తుత స్థితికి సంబంధించి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే 16 కార్ప్స్, రాష్ట్రీయ రైఫిల్స్ విభాగాల నుంచి సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ALSO READ : Sudarsan Pattnaik : క్రిస్మస్ పర్వదినాన పూరి బీచ్‌లో శాంతాక్లాజ్ సైకత శిల్పం

డిసెంబర్ 21వతేదీన జరిగిన ఉగ్రదాడిలో నలుగురు సైనికులు మరణించగా, ముగ్గురు గాయపడిన ఘటన తర్వాత ఆర్మీ చీప్ పర్యటనకు వచ్చారు. రాష్ట్రీయ రైఫిల్స్, 16 కార్ఫ్స్ సాగిస్తున్న టెర్రిరిస్ట్ నిరోధక కార్యకలాపాల గురించి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అడిగి తెలుసుకున్నారు. 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అనుమానం వ్యక్తం చేశారు.

ALSO READ : Married : సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి

ఆర్మీ చీఫ్ జమ్మూలో ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించి, దాని కార్యకలాపాలను సమీక్షించారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ వారంలో ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. జమ్మూ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైన్యం తన రక్షణను పటిష్ఠం చేసింది. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి తీవ్రవాదుల ప్రయత్నాలను నిరోధించడం లక్ష్యంగా ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేసింది.

ALSO READ : Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

ఉగ్రవాదుల కదలికలతో జమ్మూ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు కూడా ముమ్మరం చేశారు. లడఖ్ సెక్టార్ నుంచి జమ్మూ, కాశ్మీర్‌కు తిరిగి సైన్యాన్ని పంపేందుకు చర్యలు తీసుకున్నారు. ఆర్మీ చీఫ్ పర్యటనతో జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు.