Madhya Pradesh: స్కూల్ పిల్లల సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఇకపై స్కూల్ స్థాయి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎనిమిదో తరగతి విద్యార్థుల నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని..

Madhya Pradesh: స్కూల్ పిల్లల సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Madhya Pradesh

Updated On : March 28, 2022 / 5:48 PM IST

Madhya Pradesh: ఇకపై స్కూల్ స్థాయి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎనిమిదో తరగతి విద్యార్థుల నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అంతేకాకుండా వెటరినరీ టెలిమెడిసిన్ ఫెసిలిటీని కూడా ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపింది.

పశువుల కాపర్లు జంతువుల సమస్యలను ఫోన్లో చెప్పి వాటికి పరిష్కారం పొందొచ్చన్నమాట. అదే రకమైన మరోసౌకర్యాన్ని తీసుకురానుంది ప్రభుత్వం. రైతులు నిపుణులను ఫోన్లో సంప్రదించి వ్యవసాయ సంబంధిత సమస్యలను, పంటల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని పచమరీ వేదికగా జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో సీఎం వెల్లడించారు.

రెండ్రోజుల పాటు జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో సంజీవని క్లినిక్స్ ఏర్పాటు గురించి పలువురు ప్రస్తావించారు.

Read Also: తెలంగాణలో అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియమే

దేశంలోనే తొలిసారి ఎనిమిదో క్లాసు నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ పిల్లలకు అందుతుంది. వెటర్నరీ టెలిమెడిసన్ ఫెసిలిటీ, పశువుల సమస్యల గురించి ఫోన్లోనే పరిష్కారం వంటివి దొరుకుతాయని సీఎం చౌహాన్ చెప్పారు. పేద మహిళల పెళ్లి ఖర్చు కోసం ఇచ్చే కన్యాదాన్ స్కీంలో నిధులను రూ.55వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.