అబ్బాయిలతో మాట్లాడుతుందని.. హాస్టల్ విద్యార్థినిపై బ్యాంక్ మేనేజర్ దాడి

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 01:16 AM IST
అబ్బాయిలతో మాట్లాడుతుందని.. హాస్టల్ విద్యార్థినిపై బ్యాంక్ మేనేజర్ దాడి

Updated On : February 24, 2020 / 1:16 AM IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక బ్యాంకు మేనేజర్‌ మోరల్‌ పోలీసింగ్‌ పేరుతో శుక్రవారం (ఫిబ్రవరి 21, 2020) రాత్రి   లేడీస్ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాలు.. ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న అమర్‌జీత్‌ సింగ్‌(45) అనే వ్యక్తి ఇండోర్‌లోని భన్వర్‌ కువాన్‌ ప్రాంతంలో లేడీస్‌ హాస్టల్‌ దగ్గరకు వెళ్లి… హాస్టల్‌ బయట స్నేహితులతో మాట్లాడుతున్న MBA స్డూడెంట్ ని ఎందుకు అబ్బాయిలతో మాట్లాడుతున్నావంటూ..  ఆమెపై దాడి చేశాడు. దీంతో అతడిపై ఇండియన్ పీనల్ కోడ్, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు అమర్‌జీత్ సింగ్ హాస్టల్ సమీపంలోనే నివసిస్తున్నాడు. 

See Also>>అమ్మాయిని ర్యాగింగ్ చేశారనీ..బాయ్స్ హాస్టల్‌పై ఇనుప రాడ్లతో 20మంది దాడి..

దాడి చేస్తున్న సమయంలో పక్కన ఉన్న వాళ్లు వీడియో తీసి ట్విట్ చేశారు. ఆ వీడియోలో అమర్‌జీత్ సింగ్ నీలిరంగు టీషర్టు ధరించాడు. అతను కొడుతుంటే అక్కడున్నవారు ఎంత ఆపినా కానీ, అందరినీ నెట్టుకుని వెళ్లి మరీ ఆ అమ్మాయిని కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.