మహిమల చెట్టు : హత్తుకుంటే ICU ఉన్నవారి రోగాలు కూడా నయమైపోతున్నాయ్
‘మహువా’.ఆ చెట్టు దగ్గరకు వెళ్లి హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోయాలనే వార్తలతో జనాలు పోటెత్తారు.

‘మహువా’.ఆ చెట్టు దగ్గరకు వెళ్లి హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోయాలనే వార్తలతో జనాలు పోటెత్తారు.
అనారోగ్యమొస్తే కొంతమంది బాబాలు..స్వామీజీలు దగ్గరకు వెళ్తుంటారు. వారిచ్చి తాయెత్తులుకట్టుకుంటారు. కానీ ఇప్పుడు అనారోగ్యం వస్తే డాక్టర్ల దగ్గర గానీ..బాబాలు..స్వామీజీల వద్దకు గానీ వెళ్లటంలేదు ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. పది మందో లేదా వంద మందో కాదు ఏకంగా ఇప్పటివరకూ లక్షలమంది అడవిలో ఉన్న ఓ చెట్టు దగ్గరకు వెళ్తారు. ప్రతీ రోజు 25 వేల నుంచి 30 వేల మంది ఈ చెట్టు దగ్గరు వెళ్తున్నారు. హాస్పిటల్‌కు వెళ్లినా తగ్గని రోగాలు..ఆఖరికి ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ కు కూడా తగ్గని ఎన్నో అనారోగ్యాలు ఆ చెట్టు దగ్గరకు వెళితే తగ్గిపోతున్నాయట! మరి ఆ చెట్టు కాదు కాదు మహిమల చెట్టు వివరాలేంటో తెలుసుకుందాం..
అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు పేరు ‘మహువా’.ఆ చెట్టు దగ్గరకు వెళ్లి హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని తెగ ప్రచారం జరిగిపోయింది. దీంతో ప్రతీ రోజూ ఆ చెట్టు దగ్గరకు 25 వేల నుంచి 30 వేల మంది వరకు వెళ్తున్నారు.
రూప్ సింగ్ థాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు మహిమల గురించి అందరికీ తెలిసింది. రూప్ సింగ్ గతంలో కుంటుతూ నడిచేవాడట..అలా ఓ సారి ఏదో పనిమీద వెళ్లిన రూప్ సింగ్ అనుకోకుండా ఆ చెట్టుని ఆనుకున్నాడట. అలా ఆనుకున్న అతను పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాడట. ఆ తర్వాత తనలో ఏదో మార్పును వచ్చిందనీ..తాను కుంటకుండా మామూలుగానే నడుస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఆరోగ్యం మెరుగు కావడంతో.. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాననీ..ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అలా ఆ మాట మీడియాకు తెలిసింది. వెంటనే రూప్ సింగ్ వద్దకు మీడియా పరిగెత్తుకు వచ్చేసింది. అలా మీడియా ద్వారా ఆ చెట్టు దగ్గరకు పేషెంట్ల తాకిడి పెరిగింది.
నమ్మకమే దేనికైనా ప్రధానం అన్నట్లుగా ఓ పేషెంట్ ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. ఆ చెట్టుకుని ముట్టుకున్నాడు. వెంటనే తన రోగం తగ్గిపోయిదంటున్నాడు. కానీ ఇలా చెప్పిన కొద్ది గంటలనే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇలా రోగాలను తగ్గించుకోవడం కోసం పేషెంట్లు అడవి బాట పట్టి చెట్టును కావలించుకుంటున్నారు. కొందరైతే వీల్ చైర్లలోనూ ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కౌగలించుకుంటున్నారు.
అలా రోజూ వస్తున్న వారికి రోగాలు తగ్గటం మాట ఎంత వరకూ కరెక్టో గానీ స్థానికంగా వ్యాపారం మాత్రం బాగా పెరిగిపోయింది.వాటర్ ప్యాకెట్స్, స్నాక్స్, కొబ్బరి బోండాలు ఇలా ఎవరికి తోచించి వారు అమ్ముకుంటూ వ్యాపారాలు పెట్టేసుకున్నారు.
అతీంద్రియ శక్తులున్నాయని ప్రచారం చేస్తున్న ఆ చెట్టు ఫొటోలను కూడా అమ్మేసుకునేవాళ్లు తయారైపోయారు. చక్కగా సొమ్ము చేసుకంటున్నారు. ఈ చెట్టు దగ్గరు రాలేని రోగులు ఆ ఫొటోను కౌగలించుకున్నా..రోగాలు తగ్గిపోతాయని చెప్పేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో వన్యప్రాణులు తిరగాడే ఆ అడవిలో.. చెత్తాచెదారం భారీగా పెరిగిపోతోంది. వన్యప్రాణుల రక్షణకు కూడా ప్రమాదం తలెత్తే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. భారీ సంఖ్యలో జనం రావడంతో..వారి ‘మనోభావాలు’ దెబ్బతినకుండా అక్కడికి పోలీసులను సైతం తరలించారు.