Edappadi Palaniswami: అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రికి చుక్కెదురు
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పళనిస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ ఉత్తర్వులు రద్దు చేసి, కేసు మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది.

Madras High Court Rejects Edappadi Palaniswami Plea Over Money Laundering Case
Edappadi Palaniswami: అవినీతి కేసులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి చుక్కెదురైంది. రహదారులశాఖ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తనపై అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసి పుచ్చింది. అంతే కాకుండా అవసరమైతే అవినీతి నిరోధకశాఖ తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని స్పష్టం చేసింది.
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పళనిస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ ఉత్తర్వులు రద్దు చేసి, కేసు మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నేపథ్యంలో టెండర్ అవినీతి కేసులో బదులు పిటిషన్ వేసే వరకు ఏసీబీ తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించాలని కోరుతూ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రాగా అవినీతి కేసులో ప్రాథమిక విచారణ నివేదిక ఏసీబీ కమిషనర్ వద్ద ఉందని ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు. ఈ స్థాయిలో కేసు నిలుపుదల చేయడం సబబు కాదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈపీఎస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Modi – Owaisi : మోడీ చిరుతపులి కంటే వేగంగా ఎస్కేప్ అవుతారు : ప్రధానిపై ఎంపీ ఓవైసీ సెటైర్