మాస్క్ పరోటాలు వచ్చేశాయి

తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని ఒక రెస్టారెంట్ మాస్క్ పరోటాలు తయారుచేసింది. కరోనా వైరస్ గురుంచి జనాల్లో అవగాహన కల్పించేందుకే ఈ విధంగా పరోటా మాస్క్ లను చేసినట్లు మాస్క్ పరోటా’ సృష్టికర్త కె. ఎల్. కుమార్ తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం మార్కెట్లోకి మాస్క్ పరోటాలను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. వైరస్ సంక్రమణ వ్యాప్తిని తగ్గించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరాన్ని ప్రజలు గ్రహించడమే దీని లక్ష్యం అని ఆయన చెప్పారు. COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల ప్రస్తుతం మదురై జిల్లా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత సమయంలో ప్రజలకు ఏదైనా మరియు అన్ని అవగాహనలు ముఖ్యమని కుమార్ చెప్పారు. మాస్క్ లేకుండా చాలా మంది వీధుల్లో నడవడాన్ని తాను గమనించానని కుమార్ చెప్పారు.
జూన్ 8 మరియు జూన్ 23 మధ్య మదురై జిల్లాలో లాక్ డౌన్ సడలించడంతో రెస్టారెంట్ ఓపెన్ చేశామని, అయితే కస్టమర్స్ మాస్క్ ధరించకుండా రెస్టారెంట్ లోకి వస్తుందే వారని,ఆ సమయంలో తామే వాళ్ళకి ఉచితంగా మాస్క్ లు ఇచ్చినట్లు కుమార్ చెప్పారు. డెలివరీలను తీసుకెళ్లటానికి వచ్చేవారి కోసం మేము ఇంకా వాటిని అందజేస్తున్నాము అని ఆయన చెప్పారు. తమిళనాడులో చెన్నై తర్వాత కరోనా కేసులు అధికంగా ఉన్న రెండవ జిల్లాగా మధురై నిలిచింది.