Maharashtra: 70 కి.మీ. ప్రయాణించి 512 కిలోల ఉల్లి అమ్మితే.. మొత్తంగా రూ.2 వచ్చాయి
ఈయేడు మహారాష్ట్రలో ఉల్లి విపరీతంగా పండిందట. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మండి అయిన నాసిక్ ఏపీఎంసీలో ఉల్లి ధరలు 70 శాతం పడిపోయాయి. దీనికి తోడు ఈ ఖరీఫ్ సీజన్ షెల్ఫ్-లైఫ్ ఒక నెల మాత్రమే ఉన్నందున తాము పండించిన ఉల్లిని అమ్మకానికి పెట్టడం తప్ప రైతులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్‌కు వస్తుండడంతో ఆ ప్రభావం ధరల మీద మరింతగా చూపిస్తోంది
Maharashtra farmer sells 512 kg onion, receives post-dated cheque of ₹2
Maharashtra: ఉల్లిపండించిన రైతుకు కన్నీళ్లు మిగిలాయి. ఆరుగాలం చెమటోడ్చి పండించిన 512 కిలోల ఉల్లిని అమ్మకానికని 70 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్తే కేవలం రెండు రూపాయల (రూ.2) ఆదాయం వచ్చింది. రశీదు రాసి రెండు రూపాయల చెక్కు ఆ రైతు చేతిలో పెట్టాడు వ్యవసాయ మార్కెట్లోని వ్యాపారి. చెక్కు చేతిలో పడ్డాక ఆ రైతు చేతులు తెలియకుండానే తలమీదకు వెళ్లాయి. అతి నిరాశను బాధను చెప్పుకుంటూ దు:ఖమయమయ్యాడు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బోర్గావ్ గ్రామానికి చెందిన తుకారాం చవాన్ అనే రైతు వ్యధ ఇది.
Harmanpreet Kaur Cries: ఓటమి బాధతో హర్మన్‌ప్రీత్ కన్నీటిపర్యంతం.. ఓదార్చిన మాజీ కెప్టెన్
ఏపీఎంసీ వద్ద కిలో ఉల్లి ఒక్క రూపాయి పలికింది. ఈ లెక్కన తుకారాం 512 కిలోల ఉల్లికి 512 రూపాయలు వచ్చాయి. అయితే ఇందులో ఏపీఎంసీ వ్యాపారి రవాణా ఛార్జీలు, హెడ్లోడింగ్ ఛార్జీలు 509.50 అయ్యాయి. ఇక నికర లాభం 2.49 రూపాయల చెక్ వచ్చింది. అయితే ఇందులో కూడా తుకారాంకు నష్టం తప్పలేదు. బ్యాంక్ లావాదేవీ రౌండ్ ఫిగర్లో జరుగుతాయి కాబట్టి. తుకారానికి మిగిలేది కేవలం 2 రూపాయలే. పోయిన ఏడాది ఉల్లికి తాను కిలోకి 20 రూపాయల చొప్పున అమ్మినట్లు తుకారాం తెలిపాడు.
Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో పురోగతి.. 100 పేజీలతో నివేదిక సమర్పించిన కమిటీ
ఇక 3-4 ఏళ్లుగా ఎరువులు, విత్తనాల ధరలతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగి 500 కిలోల ఉల్లి పండించడానికి తనకు 40 వేల రూపాయలు ఖర్చు అయిందని తుకారాం తెలిపాడు. ఇక తుకారానికి చెక్ ఇచ్చిన వ్యాపారి నాసిర్ ఖలిఫా స్పందిస్తూ తమది కంప్యూరైజ్డ్ ప్రాసెస్ అని, దాని ప్రకారమే తుకారాంకు బిల్లు వచ్చిందని తెలిపాడు. మర్కెట్లో ధరలు లేనప్పుడు ఇలా జరుగుతుందని, గతంలో కూడా ఇలాంటి చెక్కులు చాలానే ఇచ్చామని ఖలిఫా అన్నాడు. నాణ్యమైన ఉల్లికి షోలాపూర్ ఏపీఎంసీలో ప్రస్తుతం 18 రూపాయలు ఉందట. ఇక మధ్యస్థం వాటికి 14 రూపాయలు, తక్కువ నాణ్యత ఉన్నవాటికి అసలు డిమాండే లేదట. తక్కువ నాణ్యత ఉన్న ఉల్లిపాయల్ని కొనడమే గగనమని వ్యాపారి ఖలిఫా అన్నాడు. ఇక రైతులు ఏపీఎంసీకి తీసుకువచ్చే ఉల్లిపాయల్లో కేవలం 25 శాతం మాత్రమే నాణ్యమైన ఉల్లిపాయలు ఉన్నాయట. 30 శాతం మధ్యస్థ నాణ్యమైనవి కాగా, మిగిలినవన్నీ తక్కువ నాణ్యతలో ఉన్నవేనని అంటున్నారు.
Khalistani Movement: మళ్లీ పైకి లేస్తోన్న ఖలిస్తానీ ఉద్యమం.. భింద్రన్‌వాలా 2.0గా అమృతపాల్ సింగ్!
ఇక ఈయేడు మహారాష్ట్రలో ఉల్లి విపరీతంగా పండిందట. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మండి అయిన నాసిక్ ఏపీఎంసీలో ఉల్లి ధరలు 70 శాతం పడిపోయాయి. దీనికి తోడు ఈ ఖరీఫ్ సీజన్ షెల్ఫ్-లైఫ్ ఒక నెల మాత్రమే ఉన్నందున తాము పండించిన ఉల్లిని అమ్మకానికి పెట్టడం తప్ప రైతులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్‌కు వస్తుండడంతో ఆ ప్రభావం ధరల మీద మరింతగా చూపిస్తోంది. నాసిక్ సమీపంలోని ఉల్లి మండి అయిన లాసల్గావ్కు గత డిసెంబరులో రోజుకు 15,000 క్వింటాళ్ల ఉల్లి రాగా, ఇప్పుడది డబుల్ అయి 30,000 క్వింటాళ్లు వస్తోందట. డిసెంబర్ 26న క్వింటాల్ 1,850 రూపాయలు ఉండగా, ఫిబ్రవరి 23న 550 రూపాయలకి పడిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
