Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో పురోగతి.. 100 పేజీలతో నివేదిక సమర్పించిన కమిటీ

మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో నలుగురు సభ్యుల కమిటీ సమావేశమైంది. 70 మందిని విచారించిన కమిటీ 100 పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీఎంఈకి అందించారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.

Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో పురోగతి.. 100 పేజీలతో నివేదిక సమర్పించిన కమిటీ

Medico Preethi Case : మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో నలుగురు సభ్యుల కమిటీ సమావేశమైంది. 70 మందిని విచారించిన కమిటీ 100 పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీఎంఈకి అందించారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ లేదంటున్నారు ప్రిన్సిపాల్ మోహన్ దాస్. మరోవైపు వివాదానికి కారణమైన ఎంజీఎం అనస్థీషియా డిపార్ట్ మెంట్ పై ఫోకస్ పెట్టింది విచారణ కమిటీ.

కమిటీ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 100 పేజీల నివేదికను విచారణ కమిటీ రూపొందించింది. 70 మందిని విచారించారు. అన్ని రకాల విషయాలను విచారణలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. సీల్డ్ కవర్ లో ఉంచిన నివేదికను డీఎంఈకి పంపారు. కాకతీయ మెడికల్ కాలేజీలోని అనస్థీషియా డిపార్ట్ మెంట్ లో డొల్లతనం బయటపడింది.

లోప భూయిష్టమైన డ్యూటీ చార్ట్ ఉండటం వల్లే ఆధిపత్య ధోరణి పెరిగిందనే విషయం నోటీసుకి వచ్చింది. వీటన్నింటిని పాయింట్ ఔట్ చేసిన కమిటీ సుదీర్ఘమైన నివేదిక తయారు చేసింది. కేఎంసీలో ర్యాగింగ్ లేదని చెప్పినప్పటికీ, ప్రీతి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నించే ధోరణి డాక్టర్ ప్రీతి, డాక్టర్ సైఫ్ మధ్య వివాదానికి ప్రధాన కారణంగా కమిటీ తెలుసుకుంది.