సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తల్లికే టోకరా : రూ.2.5 కోట్ల మోసం

  • Published By: nagamani ,Published On : December 10, 2020 / 02:52 PM IST
సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తల్లికే టోకరా : రూ.2.5 కోట్ల మోసం

Updated On : December 10, 2020 / 3:20 PM IST

Maharashtra : Cji bobde mother duped by property caretaker : సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తల్లికే టోకరా ఇచ్చాడో మోసగాడు. బోబ్డే తల్లి ముక్తా బోబ్డేను 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘటనలో సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసేవాడికి ఎవ్వరైనా ఒక్కటే అన్నట్లుగా ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తల్లికే టోకరా ఇవ్వాలనుకున్న ఆ ఘరానా దొంగకు బుధవారం (డిసెంబర్ 9,2020)పోలీసులు సంకెళ్లు వేశారు.


వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆకాశవాణి కేంద్రం సమీపంలో బోబ్డే కుటుంబానికి ఒక ఫంక్షన్‌ హాల్‌ ఉంది. ఆ ఫంక్షన్ హాలు జస్టిస్ ఎస్ ఏ బోబ్డే తల్లి అయిన ముక్తా బోబ్డే పేరు మీద ఉంది. దానికి 10ఏళ్లుగా తపస్ ఘోష్ అనే 47ఏళ్ల అనే వ్యక్తి కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్నాడు.


దానికి రెంట్ గా వచ్చే ఆదాయాన్ని దిగమింగేస్తున్నాడు తపస్ ఘోష్. ఫంక్షన్ హాలుపై వచ్చే అద్దెను బోబ్డే కుటుంబానికి అప్పజెప్పాల్సి ఉండగా ముక్తా బోబ్డే వృద్ధాప్యం, ఆమె అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకున్న తపస్ లెక్కల్లో తేడాలు చూపించాడు. ఆమె అనారోగ్యంన్నా అడ్వాంటేజ్ గా తీసుకున్న అతన తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి డబ్బులు కాజేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఆ ఫంక్షన్ హాల్‌కు భారీగా బుకింగ్ లు వచ్చి, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈక్రమంలో తపస్ చేసిన చీటింగ్ బైటపడింది.


లాక్ డౌన్ కారణంగా ఫంక్షన్లు వాయిదా పడటంతో దానికి డబ్బులు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వడంలో తపస్ ఘోష్ నిర్లక్ష్యం వహించాడు. దీంతో తపన్ ఘోష్ పై ఫిర్యాదులు రావడంతో ఇంతకాలంగా అతను చేస్తున్న చీటింగ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.



వచ్చే ఆదాయం..అయ్యే ఖర్చులకు సంబంధించి లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా బోబ్డే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను అరెస్టు చేశారు. ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సీజేఐ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్‌ మోసం చేశాడన్న కేసులో డీసీపీ వినీతా సాహు పర్యవేక్షణలో విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.