Maharashtra : మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం…93 మంది పోలీసులకు పాజిటివ్
ప్పటి వరకు 9 వేల 657 మందికి వైరస్ సోకింది. వీరిలో 123 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రసత్తుం 409 మంది పోలీసులు

Maharastra Unlock
Maharashtra Covid : మహారాష్ట్రలో దేశంలోకెళ్లా అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్య జనమే కాదు మంత్రులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కరోనా బారినపడుతున్నారు. పోలీస్ శాఖలోనూ కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా 93 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 9 వేల 657 మందికి వైరస్ సోకింది. వీరిలో 123 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం 409 మంది పోలీసులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read More : Science Journal : షాకింగ్ న్యూస్..ఇండియాలో 32 లక్షల కరోనా మరణాలు!
మహారాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజే 40 వేల 925 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 20 వేల 971 కేసులు నిర్ధారించారు. కోవిడ్ బారినపడి ఆరుగురు మృతి చెందారు. సెకండ్ వేవ్ తర్వాత ఇంతా భారీ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ప్రభుత్వం ఆంక్షలు మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు ఈ నెల 9 వరకు మూసివేసింది.
Read More : Srisailam : శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం.. సాంప్రదాయ దుస్తుల్లో వస్తేనే దర్శనం
ఇక రెస్టారెంట్లు, బార్లు, సినిమా హాళ్లు 50 శాతం కెపాసిటీతో మాత్రమే అనుమతి ఉంది. అయితే రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవడంతో వీకెండ్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అవసరమైతే లాక్‌డౌన్ కూడా విధించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అయితే కరోనా వ్యాపించకుండా జనం నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు ముంబై మేయర్. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, ట్రిపుల్ లేయర్ మాస్క్ ధరించాలని సూచించారు.