మహారాష్ట్రలో కరోనా కల్లోలం : ఒక్కరోజే 23,365 పాజిటీవ్.. 474 మరణాలు

  • Published By: sreehari ,Published On : September 16, 2020 / 09:26 PM IST
మహారాష్ట్రలో కరోనా కల్లోలం : ఒక్కరోజే 23,365 పాజిటీవ్.. 474 మరణాలు

Updated On : September 16, 2020 / 10:12 PM IST

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 23,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.



గత 24 గంటల్లో కొత్తగా 23,365 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,21,221కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 474 మంది కరోనాతో మృతిచెందగా ఇప్పటివరకూ కరోనా మరణాల సంఖ్య 30,883కు పెరిగింది.



ఒక రోజులో 17,559 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,92,832కు చేరింది. మహారాష్ట్రలో 2,97,125 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.